Tamannaah Bhatia: పెళ్లి కోసమేనా.. భగవంతుడి సేవ! 

ABN , Publish Date - Jan 25 , 2024 | 11:21 AM

టాలీవుడ్‌లో మిల్క్‌ బ్యూటీ తమన్నాకు (Tamannaah Bhatia)ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు ఉన్న, లేకున్నా ఆమె క్రేజ్‌ మాత్రం ఒకేలా ఉంది. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా బాలీవుడ్‌, వెబ్‌ సిరీస్‌ల మీదే ఉంది. తమన్నాకు వృత్తి భక్తితోపాటు దైవ భక్తి కూడా ఎక్కువే!

Tamannaah Bhatia: పెళ్లి కోసమేనా.. భగవంతుడి సేవ! 

టాలీవుడ్‌లో మిల్క్‌ బ్యూటీ తమన్నాకు (Tamannaah Bhatia)ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు ఉన్న, లేకున్నా ఆమె క్రేజ్‌ మాత్రం ఒకేలా ఉంది. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా బాలీవుడ్‌, వెబ్‌ సిరీస్‌ల మీదే ఉంది. తమన్నాకు వృత్తి భక్తితోపాటు దైవ భక్తి కూడా ఎక్కువే! కుదిరిన ప్రతిసారి ఇష్టదైవాన్ని మొక్కడం ఆమెకున్న అలవాటు. తాజాగా ఆమె ఓ దేవాలయాన్ని దర్శించుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత కామాక్య (Kamakya Temple) ఆలయాన్ని సందర్శించారు, అక్కడ ప్రత్యేక పూజలు సందర్శించారు.   

Tamanang.jpg

పసుపు రంగు చుడీదార్‌, నుదుటిపై కుంకుమ, మెడలో హారం, శాలువా ఇలా ఎంతో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించింది. "ప్రియమైన వారితో మధురమైన  క్షణాలను గడిపాను’ అని తమన్నా ఇనస్టాలో పోస్ట్‌ చేశారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. గత ఏడాది కూడా శివరాత్రి, సంక్రాంతి, లింగ భైరవి దేవి పూజల్లో నటి తమన్నా పాల్గొన్నారు. 

అయితే ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు తమన్నాపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు."అనుకున్న పని జరిగిందేమో అందుకే కామాక్య వెళ్లి దర్శనం చేసుకుంది. ప్రేమలో ఉన్న ఆమెకు పెళ్లి ఎప్పుడనే క్లారిటీ వచ్చిందేమో.. అయితే త్వరలోనే పెళ్లి భోజనం పెట్టబోతుందనమాట’ అని కామెంట్లు పెడుతున్నారు. తమన్నా హైదరాబాదీ విజయ్‌వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! లస్ట్‌ స్టోరీస్‌-2 సిరీస్‌ షూటింగ్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. విజయవర్మ బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె అరణ్మణై - 4, వేద, స్ట్రీ -2 చిత్రాలతో బిజీగా ఉన్నారు 


Tam-3.jpg

Updated Date - Jan 25 , 2024 | 11:21 AM