Devara: అనుకున్నంతా అయింది.. ద‌స‌రాకు వెళ్లిపోయిన ‘దేవ‌ర‌’

ABN , Publish Date - Feb 16 , 2024 | 04:16 PM

అనుకున్నంతా అయింది. జూనియ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర సినిమా మ‌రోసారి వాయిదా ప‌డింది.

Devara: అనుకున్నంతా అయింది.. ద‌స‌రాకు వెళ్లిపోయిన ‘దేవ‌ర‌’
devara

అనుకున్నంతా అయింది. జూనియ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘దేవ‌ర’ సినిమా మ‌రోసారి వాయిదా ప‌డింది. గ‌తంలోనే రెండు మార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఈ సారి ఏకంగా ద‌స‌రాకు షిప్ట్ అయింది. చిత్రాన్ని అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త డిసెంబ‌ర్‌లోనే చిత్రీక‌ర‌ణ పూర్తి కావ‌ల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది.


గ‌తంలో ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించినా.. కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా ప‌డుతున్న‌ట్లు వార్త‌లు బాగా వైర‌ల్ అవుతూ ఉన్నాయి. అదీగాక ఈ మ‌ధ్య జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. దేవ‌ర వాయిదా ప‌డితే మా సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మృణాల్ జంట‌గా న‌టిస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ను ఏప్రిల్ 5 విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో.. ‘దేవ‌ర’ విష‌యంలో వినిపిస్తున్న వార్త‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్లైంది. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ.. ఈ సినిమాను వాయిదా ప‌డింది.

Devara.jpg

అయితే ‘దేవ‌ర’ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయ ప‌డ‌డంతో గ్యాప్ రాగా, త్వ‌ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్‌ 2’ మొద‌లు కానున్న క్ర‌మంలో ఎన్టీఆర్ ఆ షూటింగ్‌లో పాల్గొనాల్సి వ‌స్తుండ‌డంతో ‘దేవ‌ర’ సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. యువసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్‌, మ‌రాఠి న‌టి శ్రుతి మరాటే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Updated Date - Feb 16 , 2024 | 04:51 PM