Devara: సముద్రంలో తారక్‌.. కావాలనే లీక్‌ చేశారా? ఆకతాయిల పనా?

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:52 AM

జూ.ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా నటిస్తున్న 'దేవర’ (Devara)చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్  పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ఆదివారం గోవా చేరుకుంది

Devara: సముద్రంలో తారక్‌.. కావాలనే లీక్‌ చేశారా? ఆకతాయిల పనా?

జూ.ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా నటిస్తున్న 'దేవర’ (Devara)చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్  పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ఆదివారం గోవా చేరుకుంది. అక్కడ ఓ పాటతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని తెలిసింది. అయితే తాజాగా దేవర షూటింగ్‌కి సంబంధించిన ఓ వీడియో లీక్‌ అయింది. ఎన్టీఆర్‌ సముద్రం ఒడ్డున బ్లాక్‌ కలర్‌ షర్ట్‌, పంచతో నడిచి వెళ్తున్న దృశ్యాలు నెట్టింట దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే షూటింగ్‌ స్పాట్‌లో ఈ సన్నివేశాన్ని ఆకతాయిలు ఫోన్లో  చిత్రీకరించి నెట్టింట్లో వదిలారా లేక లీక్‌ల ట్రెండ్‌ నడుస్తున్న ఈ సమయంలో సినిమాకు హైప్‌ తీసుకురావడానికి చిత్ర బృందమే లీక్‌ చేసిందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. (Devara scene leak)

JC.jpg

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:20 AM