Devara: తాజా షెడ్యూల్‌ సారాంశం ఇదే!

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:15 AM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) మరో వార్‌కి రెడీ అవుతున్నారు. ఈ నెల 14 నుంచి దేవర (Devara) తాజా షెడ్యూల్‌ మొదలు కానుంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధం చేశారు కొరటాల శివ (Koratala siva) అండ్‌ టీమ్‌. గత నెలలో సైఫ్‌ అలీఖాన్ కు ప్రమాదం జరగడంతో షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ వచ్చింది.

Devara:  తాజా షెడ్యూల్‌ సారాంశం ఇదే!


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) మరో వార్‌కి రెడీ అవుతున్నారు. ఈ నెల 14 నుంచి దేవర (Devara) తాజా షెడ్యూల్‌ మొదలు కానుంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధం చేశారు కొరటాల శివ (Koratala siva) అండ్‌ టీమ్‌. గత నెలలో సైఫ్‌ అలీఖాన్ కు ప్రమాదం జరగడంతో షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ వచ్చింది. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, సైప్‌ అలీ ఖాన్ కాంబినేషన్  సీన్స్  కాకుండా ఇతర సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో సెకండ్‌ హీరోయిన్‌తోపాటు కీలక పాత్రధారులు జాయిన్‌ అయ్యే అవకాశం ఉందట. గత ఏడాది డిసెంబర్‌ నెలాఖరుకు  ఈ చిత్రం  షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేయాల్సి ఉంది. అనేకా కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది.


Janhvi-Kapoor.jpg
ఈ కారణంతో బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ పరిచయ చిత్రం 'వార్‌ 2' షూటింగ్‌ లేట్‌ అవుతోంది. దేవరలో తన పార్ట్‌ వరకూ కంప్లీట్‌ చేసైనా సరే 'వార్‌ 2' సెట్స్‌లో జాయిన్‌ కావడానికి ఎన్టీఆర్‌ రెడీ అవుతున్నారు. మార్చి నెలలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తామని హృతిక్‌ రోషన్  ఇటీవల  విడుదలైన ఫైటర్‌ చిత్రం ప్రమోషన్స్ లో  తెలిపారు. ఎన్టీఆర్‌ రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.  తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ తనకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసి 'వార్‌-2' సెట్‌లో అడుగుపెడతారని టాక్‌ నడుస్తోంది.

Shruthi-Marathe.jpg

దేవర చిత్రంలో తారక్‌ సరసన అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఇందులో సెకెండ్‌ హీరోయిన్ కు  కూడా ఆస్కారం ఉంది. రెండో  హీరోయిన్ గా   మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే కనిపించనుందనే వార్త వైరల్‌ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువసుధా ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు  హరికృష్ణ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:26 AM