మీరందిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. JrNTR ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్

ABN , Publish Date - May 20 , 2024 | 10:39 PM

జూనియ‌ర్ ఎన్టీఆర్ జ‌న్మ‌దినాన్ని ఆయ‌న‌ అభిమానులు ఈరోజు (సోమ‌వారం) పండుగ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంద‌ర్భంగా Jr NTR స్పందిస్తూ.. త‌న‌ సోషల్ మీడియాలో ఓ ఎమోష‌న‌ల్‌ సందేశాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు.

మీరందిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. JrNTR ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్
ntr

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ (JrNTR,) జ‌న్మ‌దినం ఈ రోజు (మే 20). ఈ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆయన అభిమానులు ఈ రోజును పండుగ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. సామాన్యుల నుంచి, సెల‌బ్రిటీలు, పొలిటీషియ‌న్స్ వ‌ర‌కు అయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ఫ్యాన్స్ అయితే సోష‌ల్ మీడియాలో #JrNTR, "Happy Birthday Anna" అనే హ్యాష్‌ట్యాగ్‌ల‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువ‌చ్చారు. ర‌క్త‌దానాలు, అన్న‌దానాలు, పండ్ల పంపిణీ వంటి సామాజిక కార్య‌క్ర‌మాలు చేస్తూ త‌మ హీరోపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. మ‌హేశ్‌బాబు,ప‌వ‌రన్ క‌ళ్యాణ్, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ వంటి అగ్ర తార‌లు త‌మ సామాజిక మాద్య‌మాల ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.


GOBNHSBXIAAQIr5.jpeg

ఈ సంద‌ర్భంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందిస్తూ.. తనపై అమితమైన ప్రేమను చూపిస్తూ బర్త్‌ డే శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికి తారక్‌ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోష‌న‌ల్‌ సందేశాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు.

ప్రియమైన అభిమానులకు కృతజ్ఞతలు. నా మొదటి రోజు నుంచి నా ఈ ప్రయాణానికి మీరు అందిస్తున్న మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు దేవర సినిమా మొద‌టి పాట‌పై మీరు చూపిస్తున్న ఆదరణ అత్యున్నతమైనది. నా పుట్టిన రోజు సంద‌ర్భంగా మీ అమూల్యమైన శుభాకాంక్షలు తెలియజేసిన నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. అని త‌న సామాజిక మాధ్య‌మంలో ట్వీట్ చేశాడు.

Updated Date - May 20 , 2024 | 10:39 PM