Kalki latest update: దీపికా భర్త కామెంట్‌ ఏంటంటే!

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:40 PM

‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌ కోసం ప్రభాస్‌ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనిపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది.

Kalki latest update:  దీపికా భర్త కామెంట్‌ ఏంటంటే!

‘కల్కి 2898 ఏడీ’ (Kalki) ట్రైలర్‌ కోసం ప్రభాస్‌ (prabhas)అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనిపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది. జూన్‌ 10వ తేదీ సాయంత్రం ట్రైలర్‌ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక్కో అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. ఇటీవల అమితాబ్‌ బచ్చన పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా దీపికా పదుకొణె లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  


𝐓𝐡𝐞 𝐡𝐨𝐩𝐞 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐰𝐢𝐭𝐡 𝐡𝐞𝐫  అంటూ ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌ ఇవాళ దీపికా పదుకోన కొత్త లుక్‌ను విడుదల చేసింది. దీపిక సైతం ఆ పోస్టర్‌ తన ఇన్‌స్ట్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దాని కింద ‘బూమ్‌ స్టన్నర్‌!’ అని ఆమె భర్త బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ కామెంట్‌ చేశారు. 

‘కల్కి’లో దీపికా పదుకోన్‌ కొత్త పోస్టర్‌ తెలుగమ్మాయి శోభితా ధూళిపాళకు బాగా నచ్చింది. ‘వావ్‌’ అని ఆమె కూడా కామెంట్‌ చేశారు.పలువురు సెలబ్రిటీలు సైతం దీపిక మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యాధునికి సాంకేతికతో తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్‌ సంస్థలో దిగ్గజ నిర్మాతల్లో ఒకరైన సి అశ్వనీదత్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో లోకనాయకుడు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 04:40 PM