Pushpa 2: రెండు విషయాల్లో తిప్పలు తప్పడం లేదు!

ABN , Publish Date - May 18 , 2024 | 02:00 PM

ఆగస్ట్‌ 15న ఎలాగైనా విడుదల చేయాలని 'పుష్ష 2’ (Pushpa 2) టీమ్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ఈ సినిమా కోసం మలేషియాలో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించాలనుకొన్నారు.

Pushpa 2:  రెండు విషయాల్లో తిప్పలు తప్పడం లేదు!

ఆగస్ట్‌ 15న ఎలాగైనా విడుదల చేయాలని 'పుష్ష 2’ (Pushpa 2) టీమ్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ఈ సినిమా కోసం మలేషియాలో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించాలనుకొన్నారు. అయితే ఇప్పుడు అంత టైమ్‌ లేదు. అందుకే హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్‌ సిటీనే మలేషియాగా మారుస్తున్నారు. అక్కడ ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ తీర్చిదిద్దారు. అక్కడే మలేషియాలో 9Malasia Set in RFC) తెరకెక్కించాల్సిన సీన్స్‌ షూట్‌ చేస్తున్నారు. ‘పుష్ష 2’ షూటింగ్‌ ఎంత వేగంగా జరుగుతున్నా టీమ్‌ని రెండు విషయాలు ఇబ్బంది పెడుతున్నాయని తెలుస్తోంది.  ఒకటి.. ఫహద్‌ ఫాజిల్‌ ఈ సినిమాకు డేట్లు కేటాయించడం లేదు. ఈ సినిమాలో ఫహద్‌ కీలక ప్రాత పోషిస్తున్న సంగతి తెలిసిందే. తనపై ఇప్పటికే కొంతమేర షూటింగ్‌ చేశారు. అయితే మరో 15 రోజుల కాల్షీట్లు అవసరం అయ్యాయి.

Pushpa 2.jpg

కానీ ఫహద్‌కు ఉన్న బిజీ కారణంగా డేట్లు కేటాయించడం లేదు. మరోవైపు ఐటెమ్‌ సాంగ్‌ చేసే హీరోయిన్  సమస్య కూడా వెంటాడుతోంది. ఐటెమ్‌ గాళ్‌గా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదట లెక్కల మాస్టర్‌. చాలామంది అగ్ర కథానాయికల పేర్లు పరిశీలించారు. కానీ ఏదీ ఇంకా ఫైనల్‌ కాలేదు. ఎవరూ దొరకని పక్షంలో ఈ పాటని జాన్వీకపూర్‌తో  (janhvey kapoor) చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంలో ఈ వారంలో ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇటీవల ‘ 2’ నుంచి టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. మరో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - May 18 , 2024 | 02:01 PM