Ravichandran Ashwin: ఆ డ్యాన్స్ చూసి షాక‌య్యా.. మ‌హేశ్‌బాబు, శ్రీలీలను ఆకాశానికెత్తేసిన ఇండియ‌న్‌ క్రికెట‌ర్

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:36 PM

సంక్రాంతికి థియేట‌ర్ల‌లో విడుద‌లై క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన చిత్రం ‘గుంటూరు కారం’. తాజాగా ఈ సినిమా గురించి, అందులోని డ్యాన్సుల గురించి ప్ర‌ముఖ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మాట్లాడుతూ సినిమాను ఆకాశానికెత్తేశారు.

Ravichandran Ashwin: ఆ డ్యాన్స్ చూసి షాక‌య్యా.. మ‌హేశ్‌బాబు, శ్రీలీలను ఆకాశానికెత్తేసిన ఇండియ‌న్‌ క్రికెట‌ర్
ashwin

సంక్రాంతికి థియేట‌ర్ల‌లో విడుద‌లై క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబు (Mahesh Babu), శ్రీలీల (Sreeleela) జంట‌గా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని దాదాపు రూ. 300 కోట్లకుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన‌ ఈ సినిమా అక్క‌డా సూప‌ర్ పాజిటివ్ టాక్‌తో నెల రోజుల పాటు మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ సినిమా విడుద‌లై 50 రోజులు పూర్తైన సోష‌ల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంటూనే వ‌స్తోంది.

తాజాగా ఈ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా గురించి ప్ర‌ముఖ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ashwin) మాట్లాడుతూ.. సినిమాను ఆకాశానికెత్తేశారు. ఇటీవ‌ల‌ ఓ వీడియో కాల్‌లో త‌న మిత్రునితో అశ్విన్ మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమా చూశారా అని అడ‌గ‌గా.. నేను చూడ‌లేదని, నాకు స‌మ‌యం ఉండ‌ద‌ని, కేవ‌లం ర‌జ‌నీకాంత్ సినిమాలు మాత్ర‌మే చూస్తాన‌ని అతను జ‌వాబిచ్చాడు. దీంతో అశ్విన్‌ త‌ప్ప‌నిస‌నరిగా గుంటూరు కారం చిత్రాన్ని చూడాల‌ని కోరారు. యూ ట్యూబ్‌లో గుంటూరు కారం, శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ అని టైపు చేస్తే వ‌స్తుంద‌ని ఆ పాట చూస్తే మీ నిర్ణ‌యాన్ని మార్చుకుంటార‌ని.. మీ పేవ‌రేట్ లిస్టులో మ‌హేశ్‌బాబు (Mahesh Babu) త‌ప్ప‌క యాడ్ అవుతాడ‌ని అన్నారు.


ముఖ్యంగా ఆ పాట‌లో శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని దానికి త‌గ్గ‌ట్లుగా మ‌హేశ్‌బాబు (Mahesh Babu) ఎక్స్ట్రార్టీన‌రీగా డ్యాన్స్ చేశార‌ని.. చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌వు అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. నేను ఆ డ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశాన‌ని, ఫిదా అయ్యాన‌ని పేర్కొన్నారు. తాజాగా ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన వీడియో క‌న్వ‌ర్జేష‌న్‌ను ఇప్పుడే చూసేయండి మ‌రి.

Updated Date - Mar 19 , 2024 | 04:42 PM