Game Changer: అప్‌డేట్‌ లేదు కానీ.. ఎంట్రీ గురించి వైరల్‌!

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:36 AM

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌(Shankar) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

 Game Changer: అప్‌డేట్‌ లేదు కానీ.. ఎంట్రీ గురించి వైరల్‌!


గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌(Shankar) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో సరైన అప్‌డేట్‌ ఇవ్వకపోవడం, ఇప్పటికీ విడుదల విషయంలో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. కనీసం ఈ సమ్మర్‌లో అయినా సినిమాను విడుదల చేస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. కానీ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం  లేదు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ లో  నూతన ఉత్సాహం మొదలైంది.



సినిమాలో రామ్‌చరణ్‌ ఎంట్రీకి సంబంధించి ఓ బజ్‌ క్రియేట్‌ అయింది. చరణ్‌ ఎలివేషన్స్ తో పాటు తనదైన మార్క్‌ చూపించేలా దర్శకుడు శంకర్‌ రామ్‌ చరణ్‌ ఎంట్రీని తీర్చిదిద్దుతున్నారట. ఆ ఎంట్రీ చాలా డైనమిక్‌గా ఉంటుందని  టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే చరణ్‌పై ఐకానిక్‌ సీన్స్  తెరకెక్కించారు శంకర్‌. వాటికి మించి చెర్రీ ఎంట్రీ ఉంటుంది చరణ్‌ కెరీర్‌లో ఇదొక బెస్ట్‌ ఎంట్రీ సీన్  గా  నిలుస్తుందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ సీన్  ఎలా ఉండబోతుందో చూడాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్  సంగీతం అందిస్తున్నారు. అయితే జూలై నెలకి చిత్రీకరణ పూర్తి చేసి, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తారని టాక్‌ నడుస్తోంది.

Updated Date - Feb 25 , 2024 | 11:00 AM