Jani Master: జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:52 PM

తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని, షూటింగ్‌లకు సతీష్‌ను పిలవ‌వద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్ చేయిస్తున్నాడని, గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నట్లుగా డ్యాన్సర్ సతీష్ చెప్పుకొచ్చారు.

Jani Master: జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Jani Master

తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ (Rayadurgam Police Station)లో డ్యాన్సర్ సతీష్ (Dancer Satish) ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని, షూటింగ్‌లకు సతీష్‌ను పిలవ‌వద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్ చేయిస్తున్నాడని, గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నట్లుగా డ్యాన్సర్ సతీష్ చెప్పుకొచ్చారు. తనకు షూటింగ్ చెప్పిన మాస్టర్స్‌ను, కోఆర్డినేటర్‌లను బెదిరిస్తూ.. వారిపై ఫైన్‌లు వేయిస్తున్నాడని సతీష్ వెల్లడించారు.

Also Read- Jr NTR: ఏపీ ఎన్నికల ఫలితాలపై రియాక్టైన తారక్.. ఏమన్నారంటే?


దీనికంతటికీ కారణం జనరల్ బాడీ మీటింగ్‌లో సమస్యల‌పై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని సతీష్ పోలీసులకు కంప్లయింట్‌లో తెలిపారు. సతీష్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రస్తుతం జానీ మాస్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Read Latest Cinema News

Updated Date - Jun 05 , 2024 | 10:52 PM