Niharika Konidela: గోదారి కుర్రోళ్లతో మామూలుగా ఉండదు మరి

ABN , Publish Date - Apr 09 , 2024 | 02:37 PM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్‌ను ఖరారు చేశారు.  యదు వంశీ  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Niharika Konidela: గోదారి కుర్రోళ్లతో మామూలుగా ఉండదు మరి

నిహారిక కొణిదెల (niharika konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ (Commitee kurrallu) టైటిల్‌ను ఖరారు చేశారు.  యదు వంశీ  (yadu vamsi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సంవత్సరాది  సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే.  యదు వంశీ   ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.


commitee.jpg
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘కొత్తవాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. షూటింగ్ పూర్తయ్యింది’’ అన్నారు.

శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ ‘‘ మా మూవీ 'కమిటీ కుర్రోళ్లు' సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌కి ధన్యవాదాలు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. అందువల్లే డిఫరెంట్ కంటెంట్‌ చేసిన మా సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. పోస్టర్ విడుదల చేశాం.  తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.

Updated Date - Apr 09 , 2024 | 02:39 PM