Veera Dheera Sooran: శ‌ర‌వేగంగా.. చియాన్ విక్ర‌మ్ ‘వీర ధీర శూరన్’

ABN , Publish Date - May 13 , 2024 | 05:48 PM

విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ హీరోగా ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’. విక్ర‌మ్ 62వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

Veera Dheera Sooran: శ‌ర‌వేగంగా.. చియాన్ విక్ర‌మ్ ‘వీర ధీర శూరన్’
vikram

విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ (Chiyaan Vikram) హీరోగా హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran). విక్ర‌మ్ 62వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. తెన్ కాశీలో భారీ సెట్ వేసి సినిమాను పూర్తి చేస్తున్నారు మేక‌ర్స్‌.

ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ రోల్‌లో విక్ర‌మ్ (Chiyaan Vikram) అల‌రించ‌బోతుండగా ఆయ‌న లుక్ మాస్‌, ర‌గ్డ్‌గా ఉంది. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు పెరుగుతున్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా!. అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో విక్ర‌మ్ కాళి పాత్ర‌లో అంద‌రినీ మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు.

vds.jpeg


విక్ర‌మ్ (Chiyaan Vikram) హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధికీతో పాటు ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Updated Date - May 13 , 2024 | 05:48 PM