కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభ కుమారుడి వివాహ వేడుకకి తరలి వచ్చిన టాలీవుడ్ ప్రముఖులు

ABN, Publish Date - Jan 03 , 2024 | 01:52 PM

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లతో ఎన్నో సినిమాలలో కథానాయికగా నటించిన ప్రభ కుమారుడు రాజా రమేష్ వివాహం బుధవారం ఉదయం హైదరాబాదులో జరిగింది. ఈ వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు ఎందరో హాజరయ్యారు

Chiranjeevi attended and wish the newly wed couple

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నటి ప్రభ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 150 నుంచి 200 చిత్రాల్లో నటించారు.

స్వర్గీయ దేవభక్తుని రమేష్, ప్రభ దంపతుల కుమారుడైన రాజా రమేష్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విజయవాడ వాస్తవ్యులు స్వర్గీయ విజయ్ రామ్ రాజు వేదగిరి, శిరీష దంపతుల కుమార్తె సాయి అపర్ణతో రాజా రమేష్ వివాహం బుధవారం ఉదయం జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ నుండి ఎందరో ప్రముఖులు హాజరయి కొత్త దంపతులకి శుభాకాంక్షురాలు తెలియచేసారు.

మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సుమన్, మల్లిడి సత్యానారాయణ రెడ్డి, రాశిమూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, రోజారమణి, అన్నపూర్ణమ్మ, రజిత, కృష్ణవేణి, శివపార్వతి, వై. విజయ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ప్రభ ప్రముఖ కూచిపూడి నృత్యాకారిణి కూడా. ప్రముఖ నాట్య గురువు వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 'నీడలేని ఆడది' చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కమల్ హాసన్, చిరంజీవి తదితర హీరోలందరి పక్కన కథానాయికగా నటించారు.

ముఖ్యంగా మహానటుడు ఎన్టీఆర్ రూపొందించిన 'దానవీరశూర కర్ణ' చిత్రంలోని 'చిత్రం భళారే విచిత్రం' పాటలో ప్రభ అభినయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆమెకు ఒకే ఒక్క కుమారుడు. వారి ఇంట జరుగుతున్న ఈ శుభకార్యానికి తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తూ తరలివచ్చింది. తెలుగుదేశం పార్టీ నేత ఆలపాటి రాజా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

Updated Date - Jan 03 , 2024 | 01:52 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!