Chiranjeevi: ప్రాణం వద్దు.. కాస్త రక్త దానం చేయండన్నాను! 

ABN , Publish Date - Feb 04 , 2024 | 03:02 PM

పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆదివారం మధ్యాహ్నాం శిల్పా కళావేదికలో జరిగిన ఈ వేడుకలో  పద్మ పురస్కారానికి ఎంపికైన కళాకారులను  తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రుల ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ

Chiranjeevi: ప్రాణం వద్దు.. కాస్త రక్త దానం చేయండన్నాను! 

పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఘనంగా సత్కరించింది. ఆదివారం మధ్యాహ్నాం శిల్పా కళావేదికలో జరిగిన ఈ వేడుకలో  పద్మ పురస్కారానికి ఎంపికైన కళాకారులను  తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) , పలువురు మంత్రుల ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ "ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ వేదిక చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కళను జీవితంగా భావించి, దానినే నమ్ముకుని ముందుకెళ్తున్న వారి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో (Padma awards) సత్కరించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఆ వెంటనే స్పందించి పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించాలని ఆలోచన చేయడం, సన్మానించడం బహుశా ఇదే మొదటిసారి. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు ధన్యవాదాలు. ఇలా చేయడం కళలకు, కళాకారులకు ప్రోత్సాహం అందించినట్లవుతుంది. అంతే కాదు నంది అవార్డులు గత చరిత్రలా అయిపోయాయి. వాటిని త్వరలో ఇస్తామని సీఎం ప్రకటించడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ అవార్డులకు గద్దర్‌ పేరు పెట్టాలనే నిర్ణయం ఎంతో సంతోషకరం. కళాకారులకు అవార్డులు ఇస్త్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని అన్నారు. 

Mega-2.jpg

పద్మ విభూషణ్‌ ప్రకటించడానికి ముందు ఏం జరిగిందో చిరంజీవి వేదికపై వివరించారు. 

"ఆ రోజు మధ్యాహ్నం  కేంద్ర హోం డిపార్ట్‌మెంట్‌ నుంచి ఫోన్ వచ్చింది. 'మీకు పద్మవిభూషణ్‌ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మీ ఆమోదం మాకు తెలియాలి’ అని ఆ ఫోన్ సారాంశం. అప్పటికే సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. మనకు వస్తుందా అనే మీమాంస నాలో ఉంది. కానీ కేంద్ర నుంచి ఫోన్  రాగానే షాక్‌ అయ్యాను. సాయంత్రం ఆరు, ఏడు గంటలకు ప్రకటిస్తారు అని వారు చెప్పారు.  నేనిక టీవీ ముందే కూర్చున్నాను. వాళ్లు చెప్పిన టైమ్‌ దాటింది కానీ ప్రకటన రాలేదు. అలాగే ఎదురు చూస్తూనే ఉన్నా. కాసేపటికి పద్మశ్రీ పురస్కారాలు 34మందికిపైగా ప్రకటించారు. దాంతో కాస్త ఎలర్ట్‌ అయ్యి 'నెక్ట్స్‌ నాదే.. అంతా సైలైంట్‌గా కూర్చోండి' అని ఇంట్లో అందరికీ చెప్పా. అరగంట, గంట, గంటన్నర అయింది కానీ ప్రకటన రాలేదు. ఓరి బాబోయ్‌ లాస్ట్‌ మినిట్‌లో ఏమన్నా మారిందా? మనకు రాలేదా? అనే చిన్న మీమాంసలో ఉన్నాను. ఆ తర్వాత ప్రకటించారు. ఇదే విషయాన్ని వెంకయ్య నాయుడు గారిని కలిసిన సందర్భంలో ఆయనకు చెప్పాను. ఇదంతా నరేంద్ర మోదీ గారు ప్లాన్  అండీ. పద్మశ్రీ అవార్డులను బడుగు బలహీన వర్గాల్లో ప్రతిభ ఉన్నవారిని గుర్తించి అవార్డు ఇచ్చారు. ముందే మనలాంటి వారి పేర్లు ప్రకటిస్తే మీడియా మొత్తం మన మీదే ఫోకస్‌ చేస్తుంది. పద్మశ్రీ అవార్డులు ఎవరికి వచ్చాయో కూడా తెలీదు. వాళ్లు జనాల్లోకి వెళ్లి వారు ఎవరో జనాలకు తెలియం కోసమే ఓ గంట ఆలస్యంగా ప్రకటించారు’’ అని వెంకయ్యనాయుడుగారు చెప్పగానే మోదీగారి మీద మరింత గౌరవం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పురస్కారం ప్రకటించడం, మా అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం సన్మానించడం గొప్ప విషయం. ఈ పురస్కారాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నా జన్మ సార్థకం అయినట్టుంది. పద్మ విభూషణ్‌ పుర్కస్కారం వచ్చాక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మనసారా ఆశీర్వదిస్తుంటే ఈ జన్మకిది చాలు అనిపిస్తోంది. మా అమ్మానాన్నల పుణ్యఫలం నాకు సంక్రమించింది" అని చిరంజీవి అన్నారు. 

Mega.jpg

పొంగులా వచ్చి చల్లారిపోతుందేమో అనుకున్నా

"సినిమాలో రాణిస్తూ, దశాబ్ధాలుగా ప్రథమస్థానంలో ఉంటూ ఆర్టిస్ట్‌ సినిమాలకే పరిమితం కాకూడదు.. సామాజిక బాధ్యత కూడా ఉండాలని సేవా రంగంలోకి దిగాను. నాకు నేనుగా అనుకున్న పని ఇది. నా అభిమానులు సినిమా థియేటర్‌లకో, వాల్‌ పోస్టర్‌లకో, పాలాభిషేకాలకో, గొడవలకో కేరాఫ్‌ కాకూడదని, ఆ కల్చర్‌ను మార్చాలని  శక్తిమంతమైన అభిమానులను సేవా మార్గం వైపు దారి మళ్లించాను. వారు అన్  గైడెడ్‌ మిసైల్‌లా ఉండకుండా ఛానలైజ్‌ చేస్తే సత్కార్యాలు మంచిగా చేయించవచ్చు' అనే ఆలోచన 1990ల సమయంలో వచ్చింది. అందులో భాగంగా ఆ రోజుల్లో రక్తం దొరకక ఎంతో మంది మరణిస్తున్న సందర్భాలు చూసి బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించా. అభిమానులు నా కోసం ప్రాణం ఇస్తానంటారు.. నాకు ప్రాణం వద్దు.. రక్తం ఇవ్వండి’ అని 25 ఏళ్ల క్రితం పిలుపిచ్చాను. ఈ ఉత్సాహం పొంగులా వచ్చి చల్లారిపోతుందేమో అనుకున్నా. కానీ నా అభిమానులు దానిని ఓ జీవనదిలా తీసుకెళ్తూనే ఉన్నారు. ఈ రోజుకూ  ఎన్నో సందర్భాల్లో రక్తదానం చేస్తున్నారంటే దీనికి నాంది పలికింది నేనూ, నా అభిమానులు అని గర్వంగా చెప్పుకోగలను. కరోనా సమయంలో గడప దాటే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో సినీ కార్మికులకు కరోనా క్రైసెస్‌ ఛారిటీ ద్వారా నాలుగు నెలలపాటు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందజేశాం. ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేతులెత్తేసిన సమయంలో కేవలం పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 32 ప్రాంతాల్లో ఆక్సిజన్  బ్యాంక్స్‌ నెలకొల్పాం. రక్తం అందించాం. ఇవన్నీ గుర్తించేనేమో ప్రభుత్వం నాకు ఈ పురస్కారం అందించింది. అయితే నేను అవార్డుల కోసం ఏ రోజు ఎదురుచూడలేదు. కోట్లమంది గుండెల్లో అభిమాన హీరోగా ఉన్నా. ఇంతకన్నా గొప్ప అవార్డు ఏదీ ఉండదు. భగవంతుడు ఈ శక్తిని రెట్టింపు చేస్తే ఇలాగే సినిమాలు చేస్తాను.. ఆడతాను, పాడతాను.. స్టెప్పులేస్తా.. ఫైట్స్‌ చేస్తా.. మీరు ఇదే అభిమానం చూపిస్తూ ఇలాగే  ఉండండి. నేను ఇలాగే  రెట్టింపు ఉత్సాహంతో అంతకుమించి సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటా’’ అని అన్నారు. 

ఆయన వాగ్థాటికి అభిమానిని... 

రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడు. వాజ్‌పేయీ అంతటి హుందాతనం ఆయనలో ఉంది. వెంకయ్య వాగ్థాటికి నేను పెద్ద అబిమానిని. చిన్నతనం నుంచి ఆయన మాకు స్ఫూర్తి. రాజకీయాల్లో రానురాను దుర్భాషలు ఎక్కువైపోతున్నాయి. నోరుజారి  వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లకి బుద్థి చెప్పే శక్తి ప్రజలకే ఉంది’’ అని చిరంజీవి అన్నారు.


Updated Date - Feb 04 , 2024 | 03:37 PM