Ayodhya ram mandir: అంజనా దేవి కుమారుడే స్వయంగా నాకిచ్చిన వరం!

ABN , Publish Date - Jan 21 , 2024 | 07:31 PM

"అయోధ్య రామమందిరం.. చరిత్ర సృష్టిస్తోంది చరిత్రను ఉర్రూతలూగిస్తోంది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపొతుంది ఇది నిజంగా అపరిమితమైన అనుభూతి...’’ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ఆనందోత్సహంతో ట్వీట్‌ చేశారు. 

Ayodhya ram mandir:  అంజనా దేవి కుమారుడే స్వయంగా నాకిచ్చిన వరం!

"అయోధ్య రామమందిరం.. ((Ayodhya Ram mandir) చరిత్ర సృష్టిస్తోంది

చరిత్రను ఉర్రూతలూగిస్తోంది

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపొతుంది

ఇది నిజంగా అపరిమితమైన అనుభూతి...’’ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆనందోత్సహంతో ట్వీట్‌ చేశారు. 

అయోధ్య రామమందిరంలో బాలరాముడి (Bala ramudu)ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం  అందడం, సోమవారం ప్రతిష్ఠ జరుగబోతున్న నేపథ్యంలో ఆయనకు ఆహ్వానం అందం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను, ఈ ఆహ్వానాన్ని అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

"ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. గౌరవనీయులైన ప్రధాన మంత్రి  మోదీ జీ ఈ గౌరవాన్ని అందించినందుకు హృదయపూర్వక అభినందనలు. అలాగే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి గారికి హృదయపూర్వక అభినందనలు.ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.. జై శ్రీ రామ్‌’’ అని చిరంజీవి ట్విట్టర్‌ (ఎక్స్‌ )లో పేర్కొన్నారు. 

Updated Date - Jan 21 , 2024 | 08:26 PM