Chiranjeevi: పిఠాపురంలో నా తమ్ముడు గెలవాలని కోరుకుంటున్నా

ABN , Publish Date - May 10 , 2024 | 06:47 PM

''సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి అన్నారు.

Chiranjeevi: పిఠాపురంలో నా తమ్ముడు గెలవాలని కోరుకుంటున్నా

''సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని అన్నారు. 

WhatsApp Image 2024-05-10 at 6.07.34 PM.jpeg
అలాగే ఈ నెల 13న జరగనున్న ఎన్నికల గురించి అయన స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల గురించి (Ap elections) మాట్లాడాలంటే నేను ఏ పార్టీలో లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan for Pitapuram) గెలవాలని కోరుకుంటున్నాను. పవన్‌‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లటం లేదు. పవన్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చాడు. అలాగే పవన్ కూడా నన్ను ప్రచారానికి రావాలని ఎప్పుడూ అడగలేదు’’ అన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Updated Date - May 10 , 2024 | 06:52 PM