Chiranjeevi: ఘనంగా సౌత్  ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌!

ABN , Publish Date - Mar 23 , 2024 | 10:43 AM

ప్రముఖ నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ సంస్థలు సంయుక్తంగా సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని 9South india Film Festival) నిర్వహించాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు.

Chiranjeevi: ఘనంగా సౌత్  ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌!

ప్రముఖ నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ సంస్థలు సంయుక్తంగా సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని 9South india Film Festival) నిర్వహించాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు. పద్మవిభూషణ్‌ పురస్కారం పొందిన ఆయన్ను వేదికపై సత్కరించారు. వేదకపై ఉన్న మెగాస్టార్‌కు ఆంజనేయుడి ప్రతిమను అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, టీజీ విశ్వప్రసాద్‌ అందించారు.

Chiru.jpg

దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న చిరంజీవిని ఇప్పటికే పలు వేదికలపై సత్కరించారు. గత నెలలో లాస్‌ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా చిరును ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స ‘మెగా ఫెలిసిటేషన్‌ ఈవెంట్‌’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి చిరుని గౌరవించారు. చిరంజీవికి అవార్డు వచ్చిన సమయంలో ఆయనకు ఇండస్ట్రీ తరఫున సన్మానించబోతున్నాం అని  పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా కార్యాచరణ జరగలేదు.   ఈ కార్యక్రమంలో  మణిశర్మ, తనికెళ్ల భరణి, కె.ఎస్‌.రామారావు, మంచు లక్ష్మీ, టీజీ వెంకటేశ్‌తోపాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  

Updated Date - Mar 23 , 2024 | 11:18 AM