Chiranjeevi: శక్తిని, మహా వ్యక్తిని కోల్పోయాం 

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:31 PM

ఈనాడు గ్రూప్స్‌ ఛైర్మన్  రామోజీరావు (Ramojirao)నేటి తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే! మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు

Chiranjeevi: శక్తిని, మహా వ్యక్తిని కోల్పోయాం 


ఈనాడు గ్రూప్స్‌ ఛైర్మన్  రామోజీరావు (Ramojirao)నేటి తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే! మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రామోజీరావు పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. "ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడిని. ఆ సమయంలో ఒక పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకున్నారు. తెగ సంబరపడిపోయారు. అంతేకాదు, ఆయన దాచుకున్న పెన్నులను కూడా చూపించారు. రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి. అందరూ ఆయనలో గంభీరాన్ని చూస్తే, నేను చిన్న పిల్లాడిని చూశా. ఇప్పుడు మనమంతా ఒక పెద్దని, శక్తిని, వ్యక్తిని కోల్పోయాం. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. అయన ఆశయాలను వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి" అని అన్నారు చిరంజీవి.

అక్కినేని నాగార్జును (nagarjuna) కూడా రామోజీరావుకు నివాళి అర్పించారు. ఆయన గొప్ప దార్శనికుడు. ఎంచుకున్న ప్రతిరంగంలో సక్సెస్‌ అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళ స్టార్‌, విశ్వనాయకుడు కమల్‌ హాసన్ (kamal haasan) ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. "భారతీయ మీడియా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడు, ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావుగారి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. రామోజీరావు  ఫిల్మ్‌ సిటీ తన క్రాఫ్ట్‌ గౌరవార్థం అంకితం చేయబడింది, ఇది షూటింగ్‌ లొకేషన్‌ మాత్రమే కాదు, ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఈ దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు అయిన ఆయన మరణించడం భారతీయ సినిమాకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఈటీవీ, ఈనాడు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, ఉషా కిరణ్‌ సినిమాలు, మయూరి.. సంస్థలు, ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసాను. ఆయన ప్రతి చోటు ఉన్నారు. అయినా మిమల్ని ఎప్పుడూ కలవలేదు. వీడ్కోలు లెజెండ్‌ రామోజీ రావు గారు’’

-నాని


"బాలనటుడిగా మనసు మమత సినిమా‌, హీరోగా 'నువ్వేకావాలి' సినిమా ..ఈ రెండు ఉషాకిరణ్ మూవీస్ లోనే ..రామోజీరావు గారి గైడెన్స్ లోనే ఇంట్రడ్యూస్ అవటం జరిగింది. అది నా అదృష్టం. జీవితాంతం‌ నేను ఆయనకు రుణపడి ఉంటాను. వారి మరణం సినీ రాజకీయ పాత్రికేయ రంగాలకే కాదు. దేశానికే తీరని లోటు.. లెజెండ్ నెవర్ డైస్.. వారు మన గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారు"
వారి ఆత్మకు శాంతి చేకూరాలి. 

- తరుణ్ 

Updated Date - Jun 08 , 2024 | 04:56 PM