Chiranjeevi: అలా అరిచేసరికి ఆ రోజు భోజనం చేయలేదు!

ABN , Publish Date - Apr 01 , 2024 | 11:28 AM

‘‘సొసైటీలో ఎవరి జీవితం కేక్‌వాక్‌లా సాగదు. జీవితంలో దేనికి షార్ట్‌ కట్స్‌ లేవు. అందులోనూ సక్సెస్‌ కి  షార్ట్‌కట్‌ అసలే ఉండదు. చాలా కష్టాలు, ఎత్తు పల్లాలు, పడిలేవటాలు, జయాపజయాలు, ఎగ్జైట్‌మెంట్‌, డిప్రెషన్‌ ఇలా అన్నీ ఉంటాయి.

Chiranjeevi: అలా అరిచేసరికి ఆ రోజు భోజనం చేయలేదు!

‘‘సొసైటీలో ఎవరి జీవితం కేక్‌వాక్‌లా సాగదు. జీవితంలో దేనికి షార్ట్‌ కట్స్‌ లేవు. అందులోనూ సక్సెస్‌ కి  షార్ట్‌కట్‌ అసలే ఉండదు. చాలా కష్టాలు, ఎత్తు పల్లాలు, పడిలేవటాలు, జయాపజయాలు, ఎగ్జైట్‌మెంట్‌, డిప్రెషన్‌ ఇలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని వచ్చినవాడినే నేను. నా జీవితంలో ఇవన్నీ చూశాను’’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Megastar chiranjeevi) అన్నారు. తెలుగు డిజిటల్‌ మీడియా ఫెడరేషన్‌కు సంబంధించిన ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు విజయ్‌ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌లో కెరీర్‌ మొదట్లో మెగాస్టార్‌ ఎదుర్కొన్న కష్టాలు ఏంటో చెప్పమని, వాటిని ఎలా డీల్‌ చేశారో అందరితో షేర్‌ చేసుకోమని కోరాడు విజయ్‌. అది విని చాలామంది ఇన్‌స్పైర్‌ అవుతారని విజయ్‌ అన్నారు. దీంతో చిరంజీవి కూడా ఒక్కసారిగా తన కెరీర్‌ మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కున్నానని చెప్తూ.. తను నటించిన ‘న్యాయం కావాలి’ (Nyayam kaavali) సినిమా సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.


‘‘సొసైటీలో ఎవరి జీవితం కేక్‌వాక్‌లా సాగదు. జీవితంలో దేనికి షార్ట్‌ కట్స్‌ లేవు. అందులోనూ సక్సెస్‌సి షార్ట్‌కట్‌ అసలే ఉండదు. చాలా కష్టాలు, ఎత్తు పల్లాలు, పడిలేవటాలు, జయాపజయాలు, ఎగ్జైట్‌మెంట్‌, డిప్రెషన్‌ ఇలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని వచ్చినవాడినే నేను. నా జీవితంలో ఇవన్నీ చూశాను. నా మైండ్‌సెట్‌ ఎలా ఉందో తెలియాలంటే ఒకేఒక్క ఉదాహరణ చెబుతాను. అది న్యాయం కావాలి సినిమా షూటింగ్ సమయం. చాలా గ్యాప్‌ తర్వాత ఆ సినిమాతో శారద రీ ఎంట్రీకి సిద్థమయ్యారు. ఆవిడ ఒక డిఫెన్స్‌ లాయర్‌ పాత్రలో కనిపించారు. నా తరపున జగయ్య డిఫెన్స్‌ లాయర్‌గా చేశారు. రాధిక కూడా ఆ సీన్‌లో ఉంది. క్రాంతి కుమార్‌ ప్రొడ్యూసర్‌ అయినా కూడా పైన క్రేన్‌లో ఉండి ఆపరేట్‌ చేస్తున్నారు. దాదాపు 400 మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. ఆ షూటింగ్‌లో చిన్న సంఘటన జరిగింది.  సినిమాలో చివరిగా తీర్పునిచ్చే సీన్‌ షూట్‌ చేస్తున్నాం. అందరూ రెడీగా ఉన్నారు. నేను బయట ఉన్నాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వచ్చి పిలిచాడు. లోపలికి వచ్చి బోన్‌లో నిలబడ్డాను. అందరి ముందు క్రాంతి కుమార్‌.. ‘ఏంటండి మిమ్మల్ని కూడా పిలవాలా? వచ్చి ఇక్కడ పడుండరా మీరు. అప్పుడే మీరేమైనా సూపర్‌స్టార్‌ అనుకుంటున్నారా? ఉండండి.. జగయ్య, శారదలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు లేరా?’ అనేసరికి ఒక్కసారిగా గుండె పిండేసినట్టు అయ్యింది. ఇందులో నా తప్పేముంది నేను బయటే ఉన్నాను. ఎందుకిలా అరిచారు. పైగా క్రేన్‌ పైన ఉండి అరిచేసరికి ఆయన అరుపులు అందరికీ వినిపించాయి. ఆరోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్థి కాలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లాక క్రాంతి కుమార్‌ నాకు ఫోన్‌ చేశారు. సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఆయన స్ర్టెస్‌లో ఆయన ఉన్నాడు. ఆయన కోపాన్ని నా మీద చూపించారు. కానీ అది పద్థతి కాదు. ఆ విషయం నన్ను ఎంత డిప్రెస్‌ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను. కానీ అవన్నీ పక్కన పెడితే.. ఒక్క మాట మాత్రం నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. సూపర్‌స్టార్‌ అనుకుంటున్నారా అని ఆయన అన్న మాట మదిలో ఉండిపోయింది, అయ్యి చూపిస్తా అనే మాట మాత్రం నా మైండ్‌లో ఉండిపోయి కసి పెరిగిపోయింది. ఈ విషయాన్ని పట్టుకొని ఆయన మీద ప్రతీకారం తీర్చుకునే బదులు నా ఎదుగుదలకు అడుగులుగా వాడుకున్నాను. ఇలాంటివి చాలా జరిగాయి. నా అవమానాలను కూడా ఎదుగుదలగా మార్చుకున్నాను కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం లేదు.. ఉండదు కూడా’’ అని చిరంజీవి చెప్పారు. 

Updated Date - Apr 01 , 2024 | 01:25 PM