RAM : రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్).. సెల్యూట్ కొట్టిన సెన్సార్ బృందం

ABN , Publish Date - Jan 23 , 2024 | 05:57 PM

దేశ భక్తిని చాటి చెప్పే చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు. దేశ సైనికుల త్యాగాలు, పోరాటాలు చూపించే సినిమాలకు జనాల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఓ దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది.

RAM : రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్).. సెల్యూట్ కొట్టిన సెన్సార్ బృందం
ram

దేశ భక్తిని చాటి చెప్పే చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు. దేశ సైనికుల త్యాగాలు, పోరాటాలు చూపించే సినిమాలకు జనాల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఓ దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా అన్నీకూడా చిత్రం మీద అంచనాలు పెంచేసింది.

దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని (Deepikanjali Vadlamani) నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో సూర్య అయ్యలసోమయాజుల (Surya Ayyalasomayajula) హీరోగా పరిచయం కాబోతుండ‌గా,ధన్యా బాలకృష్ణ (Dhanya Balakrishna) హీరోయిన్‌గా నటిస్తోంది.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. 2 గంటల 24 నిమిషాల నిడివితో సినిమా రన్ టైంను లాక్ చేశారు. క్లైమాక్స్‌లోని నలభై నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ అవుతుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. మంచి సందేశాత్మకంగా చిత్రంగా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు రామ్ RAM (Rapid Action Mission) కు సెల్యూట్ కొట్టేశారని తెలుస్తోంది.

Updated Date - Jan 23 , 2024 | 05:57 PM