మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Krishnamma: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ మూవీ నుంచి.. సెలబ్రేషన్ సాంగ్ ‘దుర్గమ్మ..’ విడుదల

ABN, Publish Date - Apr 11 , 2024 | 09:44 PM

ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్ ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’ గురువారం ఈ సినిమా నుంచి ‘దుర్మమ్మ..’ అనే సెలబ్రేషన్ సాంగ్‌‌ను మేకర్స్ విడుదల చేశారు.

sathyadev

సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్ (Satya Dev).

ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’(Krishnamma). రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 3న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వి.వి.గోపాలకృష్ణ (VV Gopala Krishna) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌(Satya Dev)కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నంద గోపాల్ కీలక పాత్రల్లో నటించారు.


ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ (Krishnamma)మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.. అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా నుంచి ‘దుర్మమ్మ..’ అనే సెలబ్రేషన్ సాంగ్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. కాలభైరవ (Kaala Bhairava) సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా సాకేత్ కొమండూరి పాడారు. నవరాత్రుల సమయంలో దుర్గమ్మ ముందు హీరో సంతోషంగా ఆడిపాడే సందర్భంలో ఈ పాట వస్తుందని అర్థమవుతుంది.

Updated Date - Apr 11 , 2024 | 09:44 PM