Gandhi Jayanti: ఇప్పటివరకు 'గాంధీ'పై వచ్చిన సినిమాలివే
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:41 PM
ప్రపంచం మొత్తం కొనియాడిన గాంధీ భావాలను కేవలం భారతీయ చిత్ర సీమ నుండే కాకుండా హాలీవుడ్‌లోను చిత్రాలు రూపొంది ప్రేక్షరాధరణను పొందాయి.
'జాతిపిత' మహాత్మా గాంధీ (Mahatma Gandhi) 155వ జయంతి నేడు. ఆయన అడుగుజాడల్లో నడవటం ఆశయాలు సాధించటం కోసం కృషి చేయడం సగటు భారతీయుడి బాధ్యత. అహింస మార్గం ద్వారా కూడా విజయాలు సాదించ వచ్చు అని నిరూపించి భారతీయ ఖ్యాతిని ప్రపంచ నలుమూలాలకి విస్తరంచిన గాంధీ జయంతిని మనం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రపంచం మొత్తం కొనియాడిన గాంధీ భావాలను కేవలం భారతీయ చిత్ర సీమ నుండే కాకుండా హాలీవుడ్‌లోను చిత్రాల రూపంలో విడుదల చేశారు.
గాంధీ అంటే సినీ ప్రేమికులకు మొదటగా గుర్తొచ్చే సినిమా 'లగేరహో మున్నాభాయ్' (Lage Raho Munna Bhai) బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వంలో సంజయ్ దత్ (Sanjay Dutt), అర్షద్ వార్సీ (Arshad Warsi) నటించిన ఈ సినిమా ఓ సంచలనం. ఒక రౌడీ గాంధీ భావజాలానికి ప్రభావితమై గూండాగిరి వదిలేసి గాంధీగిరి ప్రారంభిస్తాడు. అప్పుడు అతనిలో సమాజంలో వచ్చిన మార్పు ఏమిటనేది కమర్షియల్ యాంగిల్‌లో చక్కగా చూపెట్టారు. ఇదే సినిమాని తెలుగులో ప్రభుదేవా (Prabhu Deva) శంకర్ దాదా జిందాబాద్ (Shankar Dada Zindabad) పేరుతో రీమేక్ చేశాడు. చిరంజీవి (Chiranjeevi), శ్రీకాంత్ (Srikanth) ప్రధాన పాత్రల్లో అదరగొట్టిన కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. కానీ.. టీవీలలో జనాలు ఇప్పటికి ఎగబడి చూస్తారు.
కమల్ హాసన్ (Kamal Haasan) నటించడంతో పాటు రచించి, దర్శకత్వం వహించిన చిత్రం హే రామ్ (Hey Ram). ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజై అనేక కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. ఇప్పటికి ఎంతో మంది సినీ విశ్లేషకుల సజెస్ట్ చేసే బెస్ట్ సినిమాల లిస్ట్‌లో ఈ మూవీ ఎప్పుడు స్థానం సొంతం చేసుకుంటుంది. హేమ మాలిని (Hema Malini), రాణి ముఖర్జీ (Rani Mukerji), నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) లాంటి హేమాహేమీలతో పాటు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించారు.
తెలుగులోనూ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishnavamsi) తెరకెక్కించిన 'మహాత్మ' (Mahatma) సినిమా తన మార్క్ మూవీగా నిలిచింది. శ్రీకాంత్ 100వ చిత్రంగా పొలిటికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం కమర్షియల్గా పర్వాలేదనిపించింది. ఇక సినిమాలోని ఇతర పాటలతో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) రాసిన 'ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ' సాంగ్ ఓ సంచలనం.
హాలీవుడ్ లోను 'గాంధీ' మార్క్
1982లో రిచర్డ్ అటెన్ బరో (Richard Attenborough) రూపొందించిన 'గాంధీ' చిత్రం సంచలనం సృష్టించింది. 55వ ఆస్కార్ అవార్డుల ప్రధానంలో ఏకంగా 8 ఆస్కార్ అవార్డ్‌లను కొల్లగొట్టింది. గాంధి పాత్రలో హాలీవుడ్ నటుడు బెన్ కింగ్‌స్లే (Ben Kingsley) కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌గా నిలిచింది. 1996లో హైదరాబాద్‌కి చెందిన ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగల్ (Shyam Benegal) హాలీవుడ్‌లో 'ది మేకింగ్ ఆఫ్ మహాత్మ' (The Making of a Mahatma) అనే చిత్రం నిర్మించాడు. ఫాతిమా మీర్ (Fatima Meer) రచించిన 'ది అప్రెంటిస్‌షిప్ ఆఫ్ ఎ మహాత్మ' (The Apprenticeship of a Mahatma) అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. దక్షిణ ఆఫ్రికాలో నల్లజాతీయుడిగా తెల్ల వారి అణిచివేతను గాంధీ ఎలా ఎదుర్కొన్నాడో చక్కగా చూపించారు.
గాంధీ జీవితంపై ఎమోషనల్ డ్రామాగా 2007లో గాంధీ మై ఫాదర్ (Gandhi My Father) మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకి ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ (Firoz Abbas Khan) దర్శకత్వం వహించారు. అక్షయ్ ఖన్నా (Akshay Khanna), షెఫాలీ షా (Shefali Shah) ప్రధాన పాత్రల్లో నటించగా, గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో ఈ మూవీ బెస్ట్‌గా నిలుస్తుంది.