YS Viveka: వైఎస్‌ వివేకానంద బయోపిక్‌ 'వివేకం’

ABN , Publish Date - Mar 17 , 2024 | 04:21 PM

దివంగత నాయకుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి (yS Viveka biopic) జీవిత కథ ఆధారంగా 'వివేకం' (Vivekam)పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది.

YS Viveka: వైఎస్‌ వివేకానంద బయోపిక్‌ 'వివేకం’

దివంగత నాయకుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి (yS Viveka biopic) జీవిత కథ ఆధారంగా 'వివేకం' (Vivekam)పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీబీఐ చార్జిషీట్‌, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారం ఈ చిత్రాన్ని తీసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్య, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో  ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌లో చూపించారు. నూతన ఆర్టిస్ట్‌లతో రియలిస్టిక్‌గా ఉన్న పాత్రలతో రూపొందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న www.vivekabiopic.comలో చూడొచ్చని ట్రైలర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - Mar 17 , 2024 | 07:23 PM