scorecardresearch

Bhairavam: భైరవం హీరోయిన్స్ లుక్స్ ఇవే..

ABN , Publish Date - Nov 15 , 2024 | 10:22 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్నా, రా రోహిత్, మంచు మనోజ్ కీలక పత్రాలు పోషిస్తున్న చిత్రం 'భైరవం'.  విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు.

Bhairavam: భైరవం హీరోయిన్స్ లుక్స్ ఇవే..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Srinivas) నారా రోహిత్, మంచు మనోజ్ (Manchu manoj) కీలక పత్రాలు పోషిస్తున్న చిత్రం 'భైరవం'.  విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు.   ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. రీసెంట్ గా వెన్నెల పాత్రలో అదితి శంకర్‌ ని (Adithi shankar) పరిచయం చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మరో ఇద్దరు హీరోయిన్లను  పరిచయం చేశారు. దివ్యా పిళ్లై ని బంగారు బొమ్మ "పూర్ణిమ"గా,  మరో హీరోయిన్ ఆనందిని తెలుగింటి అందం నీలిమగా  పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.  పోస్టర్ లో దివ్యా పిళ్లై ట్రెడిషనల్ శారీలో బ్యూటీఫుల్ గా కనిపించారు. తులసి కోట దగ్గర పూజ చేస్తున్న ఆనంది తెలుగింటి అందంగా మైమరపించారు. ఈ రెండు పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు. 

Updated Date - Nov 15 , 2024 | 10:22 PM