Bellamkonda Srinivas: బెల్లంకొండ 'భైరవం'.. ఫస్ట్‌ లుక్‌

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:29 PM

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా  విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'భైరవం’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం పోస్టర్‌ విడుదల చేసి వెల్లడించారు మేకర్స్‌.

Bellamkonda Srinivas: బెల్లంకొండ 'భైరవం'.. ఫస్ట్‌ లుక్‌


హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai srinivas) హీరోగా  విజయ్‌ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'భైరవం’ (Bhairavam) టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం పోస్టర్‌ విడుదల చేసి వెల్లడించారు మేకర్స్‌. ఇందులో హీరో టెరిఫిక్‌గా రగ్గడ్‌ అండ్‌ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం, ప్రజలు కాగడాలు పట్టుకొని ఉండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్‌ని యాడ్‌ చేసింది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.  నియో-నోయిర్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌లో రూపొందుతుంది. 

Bhairavam.jpg

ఇందులో మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో వారి లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ స్ర్కీన్‌ను షేర్‌ చేసుకోడం అభిమానులకు పండుగలా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ హరి కె వేదాంతం, మ్యూజిక్‌ కంపోజర్‌ శ్రీ చరణ్‌ పాకాల.  పెన్‌ స్టూడియోస్‌ డాక్టర్‌ జయంతిలాల్‌ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కెకె. రాధామోహన్‌ నిర్మాత.

Read Also: Sunny leone: భర్తనే మళ్లీ పెళ్లాడింది.. ఎందుకంటే..



 

Updated Date - Nov 04 , 2024 | 05:33 PM