Hi Nanna: హాయ్ నాన్నకు.. 'బిహైండ్‌వుడ్స్' అవార్డుల పంట‌

ABN , Publish Date - Feb 12 , 2024 | 08:32 PM

ప్రతిష్టాత్మకమైన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ ఈవెంట్ అనేక మంది ప్రముఖ స్టార్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది.

Hi Nanna: హాయ్ నాన్నకు.. 'బిహైండ్‌వుడ్స్' అవార్డుల పంట‌
nani

ప్రతిష్టాత్మకమైన బిహైండ్‌వుడ్స్ (Behindwoods) గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ ఈవెంట్ అనేక మంది ప్రముఖ స్టార్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని (Nani) హాయ్ నాన్న (Hi Nanna) 3 అవార్డులను గెలుచుకుంది. హాయ్ నాన్న(Hi Nanna)లో తన పాత్రకు ప్రశంసలు అందుకున్న నాని, ది బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ యాక్టర్ ఇన్ ఎ లీడ్ రోల్ 2023 అవార్డును అందుకున్నారు.

b538cb22-defd-4091-acc9-b039154522f2.jpg


అదేవిధంగా హాయ్ నాన్న(Hi Nanna)లో తన అద్భుతమైన నటనకు గాను మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బిహైండ్‌వుడ్స్ (Behindwoods) గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఉత్తమ నటి అవార్డును ద‌క్కించుకోగా , దర్శకుడు శౌర్యవ్ (Shouryuv) 2023 బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫిల్మ్‌మేకర్‌ అవార్డ్ ని అందుకున్నారు. ఇదిలాఉండ‌గా హాయ్ నాన్న (Hi Nanna) చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకోగా, OTTలో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో టాప్ ట్రెండ్‌లో నిలిచింది.

9422a9af-f20b-46b4-b12f-f7f9eb870da9.jpg

ఇదిలాఉండ‌గా అదే వేదిక‌పై బెస్ట్ డైరెక్ట‌ర్ ఆవార్డు యానిమ‌ల్ సినిమాకు గాను ఎంపిక క‌గా న్యాచుర‌ల్ స్టార్ నాని అవార్డును సందీప్ రెడ్డి వంగాకు అంద‌జేశారు.

Updated Date - Feb 12 , 2024 | 08:32 PM