Priyadarshi: ప్రియదర్శి జాక్‌పాట్.. పెద్ద బ్యాన‌ర్‌లో హీరోగా మ‌రో చిత్రం

ABN , Publish Date - Apr 28 , 2024 | 07:05 PM

వరుస సినిమాల‌తో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా మ‌రో కొత్త సినిమా ప‌ట్టా లెక్కింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేశారు.

Priyadarshi: ప్రియదర్శి జాక్‌పాట్.. పెద్ద బ్యాన‌ర్‌లో హీరోగా మ‌రో చిత్రం
priyadarshi

వరుస సినిమాల‌తో దూసుకుపోతున్న ప్రియదర్శి (Priyadarshi) హీరోగా మ‌రో కొత్త సినిమా ప‌ట్టా లెక్కింది. ప్రియ‌ద‌ర్శి హీరోగా ఇటీవ‌లే డార్లింగ్ అనే చిత్రం ప్రారంభ‌మ‌వ‌గా ఇప్పుడు నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (Sree Venkateswara Cinemas LLP) (SVCLLP) ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని SVACLLP & రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా సగర్వంగా ప్రెజెంట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్ (Jhanvi Narang)నిర్మాతగా మేడిన్ ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ (Navaneeth Sriram) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

priyada.jpeg

బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి (Priyadarshi) ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది.ఇవిలాఉండ‌గానే ప్ర‌స్తుతం ప్రియదర్శి చేతిలో భారీ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రం రొమాంటిక్ జాన‌ర్‌లో ఉంటుండ‌గా ప్రియదర్శి డిఫరెంట్ హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీది ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోందో తెలియజేస్తుంది.


ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్ప‌టిరే పూర్తవ‌గా.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి, 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తారాగణం, టెక్నికల్ టీం వివరాలతో పాటు చిత్రం టైటిల్ త్వరలో రివీల్ చేయనున్నారు మేకర్స్. జాన్వీ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. నిర్మాణంలో అపార అనుభవం, స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సిద్ధహస్తుడైన‌ రానా (Rana Daggubati) దగ్గుబాటి లాంటి స్టార్‌ సపోర్ట్ చేయడం జాన్వీ గుడ్ లక్.

Updated Date - Apr 28 , 2024 | 07:05 PM