Old Memory: శ్రీదేవి కూడా ఉంటే బాగుండును!

ABN , Publish Date - Jun 07 , 2024 | 07:06 PM

పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే(old memories)! ఎన్నేళ్లు అయినా ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. అలాంటి ఓ జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు నటి షామిలీ అలియాస్ బేబీ షామిలి.

Old Memory: శ్రీదేవి కూడా ఉంటే బాగుండును!
JVAS Team

పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే(old memories)! ఎన్నేళ్లు అయినా ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. అలాంటి ఓ జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు నటి షామిలీ అలియాస్ బేబీ షామిలి. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాలతో ఆకట్టుకున్న బేబీ షామిలి(Baby Shamlee).  చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ (Jagadeka veerudu athiloka sundari) చిత్రంతో ఆమెకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సోషల్‌ మీడియాలో పాట, డైలాగ్‌ల రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో చిరుతో కలిసి షామిలీ, షాలినీ, రిషి ఇద్దరూ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా నటించారు.  34 ఏళ్ళ తర్వాత ఈ ముగ్గురు కలిశారు 


తాజాగా వీరిద్దరూ మెగాస్టార్‌ను కలిశారు. ఆ ఫొటోను షామిలి ఇన్‌స్టాలో పంచుకొని ఆనందం వ్యక్తంచేశారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సెట్‌లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోతో పాటు ఇప్పటి ఫొటోను జత చేసి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ‘శ్రీదేవి కూడా ఉంటే ఇంకా బాగుండేది’ అని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న షాలిని, షామిలీ, రిషి బాలనటులుగా ఎన్నో చిత్రాల్లో నటించారు. షాలిని హీరోయినగా నటించిన ‘సఖి’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అలాగే షామిలి ‘ఓయ్‌’ చిత్రంలో కథానాయికగా చేసి అలరించారు. రిషి కూడా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 08:39 PM