మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Baby: ప్రేమికుల దినోత్సవం ప్రత్యేకం..!

ABN, Publish Date - Feb 12 , 2024 | 02:41 PM

బ్లాక్‌బస్టర్‌ 'బేబి' (baby) చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్దమవుతోంది. యూత్ ఫుల్ లవ్‌స్టోరీతో యంగ్‌ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai rajesh) దర్శకత్వం వహించిన చిత్రమిది.


బ్లాక్‌బస్టర్‌ 'బేబి' (baby) చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్దమవుతోంది. యూత్ ఫుల్ లవ్‌స్టోరీతో యంగ్‌ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai rajesh) దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చి గత ఏడాది జూలై 14న విడుదలై చిన్న చిత్రాల్లో భారీ విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. కల్ట్‌ బొమ్మగా ఆడియన్స్ లో  గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 14 వాలైంటైన్స డే సందర్భంగా థియేటర్స్‌లో రీ రిలీజ్‌ కానుంది. దీనికి సంబంధిచిన పోస్టర్‌ను మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అంతే కాదు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  పవన్ కళ్యాణ్  'తొలిప్రేమ', 'ఓయ్‌', 'సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌', 'సీతారామం' చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లో ఇప్పుడు బేబి చిత్రం కూడా చేరింది.

Updated Date - Feb 12 , 2024 | 02:41 PM