Baahubali : Crown of Blood: కానీ ఆ ఒక్కటీ అడగొద్దు

ABN , Publish Date - May 27 , 2024 | 08:20 PM

‘బాహుబలి’ రెండు భాగాలు సినీ ప్రియులను ఎంతగా అలరించాయో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటాయి. ఇప్పుడీ ఫ్రాంఛైజీలో భాగంగా యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’వచ్చిన సంగతి తెలిసిందే.

 Baahubali : Crown of Blood:  కానీ ఆ ఒక్కటీ అడగొద్దు


‘బాహుబలి’ రెండు భాగాలు సినీ ప్రియులను ఎంతగా అలరించాయో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటాయి. ఇప్పుడీ ఫ్రాంఛైజీలో భాగంగా యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ ( Baahubali: Crown of Blood) వచ్చిన సంగతి తెలిసిందే. మే 17వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో  (Disney + Hotstar) స్ట్రీమింగ్  అవుతోంది. వారానికొక ఎపిసోడ్‌ చొప్పున అందుబాటులోకి వస్తున్న ఈ సిరిస్‌ తొలి ఎపిసోడ్‌ ఇప్పుడు ఉచితంగా చూసే అవకాశాన్ని హాట్‌స్టార్‌ కల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మిగిలిన ఎపిసోడ్‌లను చూడాలంటే హాట్‌స్టార్‌ లాగిన్‌ ఉండాల్సిందే. ఈ యానిమేటెడ్‌ సిరీస్‌కు జీవన్‌ జె.కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రై.లి.సంస్థలతో కలిసి రాజమౌళి, శరద్‌ దేవరాజన్‌, శోభు యార్లగడ్డ నిర్మించారు.

‘బాహుబలి సినిమా ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అందులోని ప్రతీ పాత్రకు సంబంధించిన పూర్తి స్టోరీ రాసి పెట్టుకున్నాం. కాకపోతే ఆ మొత్తం కథను రెండు భాగాల్లో ప్రేక్షకులకు చెప్పడం అసాధ్యమని మాకు  అర్థమై.. దాన్ని గేమ్స్‌, యానిమేటెడ్‌ సిరీస్‌ ఇలా వివిధ రూపాల్లో బయటకు తీసుకురావాలని ప్రయత్నించాం.  ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి’కి సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌లా ఉండదు. ఆ రెండు భాగాలకు మధ్యలో జరిగే కథలా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది. మేము రాబోయే రోజుల్లో ఈ బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింప చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. దానికి ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇది చాలా రకాలుగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తా’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Updated Date - May 27 , 2024 | 08:20 PM