మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Galla Ashok: సితార సంస్థలో అశోక్ గల్లా సినిమా 

ABN, Publish Date - Apr 05 , 2024 | 02:41 PM

అశోక్ గల్లా (Ashok galla) తన తదుపరి చిత్రం కోసం  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో (Sitara entertainments) చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

అశోక్ గల్లా (Ashok galla) తన తదుపరి చిత్రం కోసం  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో (Sitara entertainments) చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.  ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో రాబోతుంది. చిత్ర ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌ ను బట్టి చూస్తే.. ఈ చిత్ర కథ అమెరికాలో జరుగుతుందని అర్థమవుతోంది. 'ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'తో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. "హ్యాపీ బర్త్‌డే అశోక్" అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది చిత్ర బృందం.

అలాగే ఇది నేటి తరం యువతకు సులభంగా చేరువయ్యే చిత్రంగా కనిపిస్తోంది. 'లవర్‌'లో తన నటనతో విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న 'మ్యాడ్' మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఉద్భవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  'ప్రేమమ్', 'భీష్మ', 'భీమ్లా నాయక్', 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి విజయవంతమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమాలను అందించే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.  సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య  నిర్మాతలు.  ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. త్వరలో ఇతర విషయాలు వెల్లడిస్తామని చెప్పారు నిర్మాతలు.  

Updated Date - Apr 05 , 2024 | 02:41 PM