Teppa Samudram: బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా ‘తెప్పసముద్రం’.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:51 PM

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’.

 Teppa Samudram: బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా ‘తెప్పసముద్రం’.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్
teppa samudram

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి (Arjun Ambati)హీరోగా, కిశోరి దాత్రక్ ( Kishoridhatrak) హీరోయిన్‌గా రవిశంకర్ (Ravi Shankar), చైతన్య రావు (Chaitanya Rao) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’ (Teppa Samudram). సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెప్పసముద్రం సినిమాలోని మొటది పాటను లాంచ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాటను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడుతూ ‘‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సోమచ్. ‘తెప్పసముద్రం’ చిన్న చిత్రమని చెప్పలేం. ఇదొక మంచి చిత్రం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ.. ‘ఇదొక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే మంచి సినిమాలు మరో పది వస్తాయి. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడండి’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ..‘‘నేను కొత్త నిర్మాతననే భావన లేకుండా ఇక్కడున్న ప్రతిఒక్కరూ నాకు ఎంతగానో సహకరించారు. వాళ్లందరికీ నా ధన్యవాదాలు. చైతన్యగారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు ఈ సినిమా డిస్కన్ జరిగి ఈ సినిమా ప్రారంభమైంది. ఈ నెల 19న అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.

teppa.jpg


WhatsApp Image 2024-04-15 at 1.05.31 PM.jpeg

యాక్టర్ చైతన్య మాట్లాడుతూ..‘‘నేను ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. సినిమాలో నన్ను చాలా మంచి గుర్తుపట్టలేరు. నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకు ఈ సినిమా చాలా స్పెషల్. ఈ సినిమాలో నా కూతురే హీరోయిన్. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. నేను క్యారెక్టర్ అడక్కుండానే నన్ను చేయమని చెప్పారు. ఈ సినిమా అన్ని థ్రిల్లర్ సినిమాల్లా కాదు.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమాను 19న అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ సినిమా. రాఘవేంద్రగారు, సతీష్ గారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ. విజువల్స్ చాలా బాగున్నాయి. అలాగే మ్యూజిక్ కూడా సినిమాలో ఇంకా చాలా బాగుంటుంది. నాకు డ్యాన్స్ నేర్పించి స్టెప్పులేయించిన మాస్టర్‌కు థ్యాంక్యూ. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని అన్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బడ్జెట్ తక్కువ అయినా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా 90 శాతం షూటింగ్ పోచంపల్లిలో చేశాం. అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 19న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని చెప్పారు.

Updated Date - Apr 15 , 2024 | 04:12 PM