Biggboss 7 Fame: అర్జున్  అంబటి.. ఇంట్లో సంబరాలు! 

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:17 PM

నటుడు, బిగ్‌బాస్‌ 7 (Biggboss7) కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి (Arjun ambati) తండ్రి అయ్యాడు. అర్జున్‌ భార్య సురేఖ మంగళవారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

Biggboss 7 Fame: అర్జున్  అంబటి.. ఇంట్లో సంబరాలు! 

నటుడు, బిగ్‌బాస్‌ 7 (Biggboss7) కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి (Arjun ambati) తండ్రి అయ్యాడు. అర్జున్‌ భార్య సురేఖ మంగళవారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు అర్జున. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్‌బాస్‌ హౌస్‌లో వెల్లడించాడు అర్జున్‌.  తన పేరులోని ఆర్‌.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్‌ చేసినట్లు ఓ వీకెండ్‌ ఎపిసోడ్‌లో చెప్పాడు. అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే కోరికను కూడా ఆ వేదికపైనే చెప్పాడు. తను కోరుకున్నట్లు అర్జున్‌కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్‌ ఇంట కుటుంబ సభ్యులు అంతా ఆనందంతో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా అర్జున దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్ అంబటి అర్ధనారి అనే చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని తనదైన శైలి ఆటతో ఆకట్టుకున్నాడు. షో మొదలైన ఐదు వారాల తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా అర్జున బిగ్‌బాస్‌ హౌస్‌లో సభ్యుడయ్యాడు. అతనితోపాటు వచ్చిన కంటెస్టెంట్లు మాత్రం తక్కువ రోజుల్లో ఎలిమినేట్‌ అయ్యారు. అర్జున ఫినాలే టాప్‌ 6 ప్లేస్‌లో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. 

Updated Date - Feb 20 , 2024 | 12:47 PM