Ram Gopal Varma: సర్కార్‌కే షాకిచ్చిన సర్కార్

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:46 PM

సిల్వర్ స్క్రీన్ సర్కార్ రాంగోపాల్ వర్మకు ఏపీ సర్కార్ షాకిచ్చింది.

Ram Gopal Varma: సర్కార్‌కే షాకిచ్చిన సర్కార్

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో సారి ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్ల రూపాయలు అనుచితంగా లబ్ది పొందారని.. ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళనలు మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం.

Updated Date - Dec 21 , 2024 | 03:48 PM