టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. హ‌స్య న‌టుడు విశ్వేశ్వరరావు కన్నుమూత‌

ABN , Publish Date - Apr 02 , 2024 | 06:42 PM

తెలుగు సినిమా ఇండ‌స్టీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు.

టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. హ‌స్య న‌టుడు విశ్వేశ్వరరావు కన్నుమూత‌
Visveswara Rao

తెలుగు సినిమా ఇండ‌స్టీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) (Visveswara Rao) కన్నుమూశారు. గ‌త కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ప‌ర‌మ‌ప‌దించారు. రేపు (బుధవారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేణు హీరోగా వ‌చ్చిన చెప్ప‌వే చిరుగాలి సినిమాలో సునీల్ ఇచ్చిన ఆయుర్వేద మందు (స్వ‌ర్ణ భ‌ష్మం) తిని న‌ల్ల‌గా మారే క్యారెక్ట‌ర్‌తో విశ్వేశ్వరరావుకు చాలా గుర్తింపు ల‌భించింది.

sddefault.jpg

కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు (Visveswara Rao) బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించి తెలుగు, తమిళ భాష‌ల్లో సుమారు 370కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా త‌మిళ‌నాడు, ఉమ్మ‌డి ఆంద్ర ప్ర‌దేశ్ రాష్టాల‌కు ముఖ్య‌మంత్ర‌లుగా ప‌ని చేసిన ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, జయలలితల‌తో క‌లిసి ఆయ‌న న‌టించ‌డం విశేషం. దాదాపు అన్ని హ‌స్య పాత్ర‌ల్లోనే న‌టించిన ఆయ‌న చాలా త‌మిళ సినిమాల‌కు తెలుగులో డ‌బ్బింగ్ కూడా చెప్పారు.


తెలుగులో.. చెప్ప‌వే చిరుగాలి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ముఠా మేస్త్రీ, బిగ్‌బాస్‌, ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం, శివపుత్రుడు వంటి ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు.అంతేగాక ఒక‌టి రెండు చిత్రాల‌కు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఈ మ‌ధ్య ఓ య యూ ట్యూబ్‌లో విస్సు టాకీస్ పేరుతో ఛాన‌ల్ ప్రారంభించి త‌న అనుభ‌వాల‌ను వివ‌రిస్తూ వ‌స్తున్నారు.

visveswara-rao-54-1712058205.jpg

ప్ర‌స్తుతం విశ్వేశ్వరరావు (Visveswara Rao) భౌతిక కాయాన్ని త‌ను నివ‌సిస్తున్న చైన్నై సిరుశేరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలాఉండ‌గా ఇటీవ‌లే త‌మిళ, తెలుగు న‌టులు డేనియ‌ల్ బాలాజీ, శేషు, డ‌బ్బింగ్ మాట‌ల రచయిత రామకృష్ణ, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మ‌ర‌ణాల‌ను మ‌రుకవ‌క‌ముందే ఇప్పుడు మ‌రో మ‌ర‌ణం జ‌ర‌గ‌డంతో త‌మిళ, తెలుగు ఫిలీం ఇంండ‌స్ట్రీలలో తీవ్ర విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Updated Date - Apr 02 , 2024 | 06:55 PM