Anee Master: నాకేం కాలేదు.. బావున్నాను.. ఆనీ మాస్టర్‌ వైరల్‌ పోస్ట్‌!

ABN , Publish Date - Apr 22 , 2024 | 10:02 PM

ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్‌ ఆనీ (anee master) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్‌లకు ఆమె డాన్స కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారామె.  

Anee Master: నాకేం కాలేదు.. బావున్నాను.. ఆనీ మాస్టర్‌ వైరల్‌ పోస్ట్‌!

ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్‌ ఆనీ (anee master) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్‌లకు ఆమె డాన్స కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారామె.  తాజాగా మాస్టర్‌ డ్యాన్స్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. తన అసిస్టెంట్లతో కలిసి రీల్‌ వీడియోలు చేస్తుంటారు ఆనీ, తాజాగా మాస్టర్‌ వర్షంలో తడుస్తూ డ్యాన్స్‌ చేేస ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో నీళ్లల్లో జారి కింద పడుతుంది. వర్షంలో వెరైటీగా రీల్‌ చేేసందుకు ప్రయత్నించిన ఆమె పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో మాస్టర్‌ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో  వైరల్‌ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. తాజాగా తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి గాయం కాలేదని యానీ మాస్టర్‌ క్లారిటీ ఇచ్చింది. తన మీద ఇంత ప్రేమను చూపించిన ఫ్యాన్సకు థ్యాంక్స్‌ చెప్పారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 లో పాల్గొని సందడి చేసిన ఆమె 11వ వారంలోనే ఎలిమినేట్‌ అయింది. తదుపరి మెగాస్టార్‌ చిరంజీవి  భోళా శంకర్‌లో ఓ క్యామియో రోల్‌లో నటించింది.. ఇప్పుడు సితారకు డ్యాన్స్‌ మాస్టర్‌గా వ్యవహారిస్తున్నారు ఆనీ. 

Updated Date - Apr 22 , 2024 | 10:03 PM