బిగ్‌బాస్‌కు పంపిస్తాన‌ని డ‌బ్బులు తీసుకున్నారు: స్వప్న చౌదరి

ABN , Publish Date - Jan 23 , 2024 | 08:28 PM

బిగ్‌బాస్ న‌డిచిన‌న్నీ రోజులే కాదు ఆ త‌ర్వాత కూడా నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఓ యాంక‌ర్ బిగ్‌బాస్‌కి వెళ్లాలనే ఆశతో మ‌ధ్య‌వ‌ర్తుల‌కు డబ్బులిచ్చి చేతులు కాల్చుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌య‌మై బాధితురాలు యాంకర్ స్వప్న చౌదరి అలియాస్ అమ్మినేని స్వప్న ఈ రోజు (మంగ‌ళ‌వారం) సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించింది.

బిగ్‌బాస్‌కు పంపిస్తాన‌ని డ‌బ్బులు తీసుకున్నారు: స్వప్న చౌదరి
biggboss 7

బిగ్‌బాస్ న‌డిచిన‌న్నీ రోజులే కాదు ఆ త‌ర్వాత కూడా నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఓ యాంక‌ర్ బిగ్‌బాస్‌కి వెళ్లాలనే ఆశతో మ‌ధ్య‌వ‌ర్తుల‌కు డబ్బులిచ్చి చేతులు కాల్చుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌య‌మై బాధితురాలు యాంకర్ స్వప్న చౌదరి అలియాస్ అమ్మినేని స్వప్న (Ammineni Swapna Chowdary) ఈ రోజు (మంగ‌ళ‌వారం) సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించింది.

యాంకర్ స్వప్న (Ammineni Swapna Chowdary) మాట్లాడుతూ.. నన్ను బిగ్ బాస్ షోకు పంపిస్తానంటూ తమ్మలి రాజు అనే వ్యక్తి న‌న్ను న‌మ్మించి మోసం చేశాడంటూ, అందుకు న‌న్ను రూ.5 ల‌క్ష‌లు డ‌బ్బులు అడగ‌గా అప్పు చేసి మ‌రి అత‌నికి రూ.2.5 లక్షలు ఇచ్చాన‌ని తెలిపింది. శని, ఆదివారాల్లో క్యాస్ట్యూమ్స్‌కి డబ్బులు కావాలి అని చెప్పి నా దగ్గర నుంచి రెండున్నర లక్షలు తీసుకున్నార‌ని, అందుకు సంబంధించి బాండ్ పేపర్‌పై లాస్ట్ జూన్ నెలలో అగ్రిమెంట్ కూడా చేసి ఇచ్చార‌న్నారు.


ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్‌లో బిగ్‌బాస్ స్టార్ట్ అయింద‌ని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా పంపిస్తానన్నాడ‌ని, కానీ ఉల్టా పుల్టా సీజన్ కూడా అయిపోయింద‌ని, అందులో నా పేరు ప్ర‌స్తావ‌న రాక‌పోవ‌డంతో రాజును అడిగితే స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో మోస‌పోయిన‌ట్లు గుర్తించాన‌ని తెలిపింది. డ‌బ్బు గురించి అడిగితే బిగ్‌బాస్ వాళ్లు ఇస్తారంటు జ‌వాబు దాట వేశాడ‌ని, ఆపై బెదిరింపులకు పాల్ప‌డ్డాడ‌ని తెలిపింది. అప్పుడైనా ఇస్తానని ఇస్తాడేమోనకి కాల్ చేస్తే.. ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకో.. ప్రెస్ మీట్ కొట్టుకో అని అంటున్నాడు.

చివ‌రి వరకూ నేను కన్ఫామ్ అన్నారని, నేను వేరే వాళ్ల ద్వారా ట్రై చేస్తానంటే అవసరం లేదు నేనే పంపిస్తానని చెప్పాడని పేర్కోంది. మీకు డ‌బ్బులు ఎందుకు ఇవ్వాల‌ని అడిగితే కాస్ట్యూమ్స్, పీఆర్ టీంకి అని చెప్పాడని దీంతో నాకు ఈ రెండున్నర లక్షలే కాకుండా.. నా ఫొటో షూట్ కూడా చేయించారని అందుకు నాకు పాతిక వేల వరకూ ఖర్చైంద‌ని తెలిపింది. బిగ్‌బాస్ 8 లోనైనా అవ‌కాశం ఇస్తారేమోన‌ని ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నాన‌ని,డిసెంబ‌ర్‌లోనే ఇస్తాన‌న్న డ‌బ్బులు ఇప్ప‌టివ‌ర‌కు ఇవ్వ‌లేద‌ని వివ‌రించింది.

ఓ యాంక‌ర్‌ను అయి ఉండి నేను మోస‌పోయాన‌ని, నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నార‌ని, వారి నుంచి కూడా డ‌బ్బులు తీసుకున్నాడ‌ని వారంతా బ‌య‌ట‌కు రావాల‌ని,.లీగ‌ల్‌గా ఫైట్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. డ‌బ్బుల గురించి ఓ సారి రాజును అడిగితే ఓ ఎమ్టీ చెక్ ఇచ్చాడ‌ని అది బౌన్స్ అయింద‌ని పేర్కొంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై మీడియా నాకు చాలా స‌పోర్ట్ చేసింద‌ని, అదేవిధంగా నేను పెట్టిన‌ కేసును న‌మోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసుల‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - Jan 23 , 2024 | 08:28 PM