Anasuya Bharadwaj: మంగ‌ళం శీను భార్య.. దాక్షాయ‌ణి లుక్ వ‌చ్చేసింది

ABN , Publish Date - May 15 , 2024 | 09:55 PM

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేస‌న్‌లో వ‌చ్చిన‌ చిత్రం పుష్ఫ. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పుష్ఫ పుష్ఫ‌రాజ్ పాట నెట్టింట ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్‌ను మేక‌ర్స్ ఇచ్చారు.

Anasuya Bharadwaj: మంగ‌ళం శీను భార్య.. దాక్షాయ‌ణి లుక్ వ‌చ్చేసింది
anasuya

సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేస‌న్‌లో వ‌చ్చిన‌ చిత్రం పుష్ఫ (Pushpa) ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ప్ర‌స్తుతం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా ఇటీవ‌ల విడుద‌ల చేసిన పుష్ఫ పుష్ఫ‌రాజ్ పాట నెట్టింట ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్‌ను మేక‌ర్స్ ఇచ్చారు.

అయితే.. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించ‌డమే కాక జాతీయ అవార్డుల‌ను తెచ్చి పెట్టింది. ఇక ఇందులోని పాట‌లు ఇప్ప‌టికీ జ‌నం నోళ్లలో నానుతుండ‌గా సినిమాలో న‌టించిన న‌టుల‌కు అంతే మంచి పేరు వ‌చ్చింది. సునీల్ అయితే త‌మిళ ఇండ‌స్ట్రీలో వ‌రుస సినిమాల్లో బిజీ అయ్యారంటే వారికి ఈ సినిమా ఎంత గుర్తింపు తెచ్చిందో ఇట్టే అర్ధ‌మ‌వుతోంది. అదేక్ర‌మంలో ఈ చిత్రం నుంచి ద్రాక్షాయ‌ణి పాత్ర‌ను పోషించిన అన‌సూయ (Anasuya Bharadwaj) కు సౌత్ ఇండియాలో మంచి గుర్తింపే ల‌భించింది.

GNoEyiBWkAAfznV.jpeg


ఇప్పుడు రానున్న పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) సినిమాలోనూ అదే స్థాయి విల‌నిజం ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఈ మేర‌కు తాజాగా ఈ రోజు (బుధ‌వారం) అన‌సూయ (Anasuya Bharadwaj) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా టేబుల్‌పై ఠీవీగా కూర్చొన్న దాక్షాయ‌ణి లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదిలాఉండ‌గా పుష్ప ది రూల్ (Pushpa 2 The Rule) ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది.

Updated Date - May 16 , 2024 | 11:02 AM