Anasuya: రీమేక్‌ రైట్స్‌ కోసం బాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ క్యూ..!

ABN , Publish Date - Feb 08 , 2024 | 04:00 PM

సినిమా చిన్న బడ్జెట్‌లో వచ్చిన పెద్దదైనా కథలో దమ్ముంటే చాలు బాష, ప్రాంతాల తారతయ్యం లేకుండా రీయేక్‌ చేసి ఆయా ప్రాంతాల సినీ ప్రియుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అనసూయ (Anasuya) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఓ చిత్రానికి మంచి డిమాండ్‌ పెరిగింది.

Anasuya:  రీమేక్‌ రైట్స్‌ కోసం బాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ క్యూ..!

సినిమా చిన్న బడ్జెట్‌లో వచ్చిన పెద్దదైనా కథలో దమ్ముంటే చాలు బాష, ప్రాంతాల తారతయ్యం లేకుండా రీయేక్‌ చేసి ఆయా ప్రాంతాల సినీ ప్రియుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అనసూయ (Anasuya) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఓ చిత్రానికి మంచి డిమాండ్‌ పెరిగింది. కథా బలమున్న చిత్రాలనే ఎంచుకుంటున్నా అనసూయ తాజాగా నటిస్తున్న చిత్రం ‘అరి’ (Ari). ‘పేపర్‌ బాయ్‌’ ఫేమ్‌ జయశంకర్‌ (Jaya shankar) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే కోలీవుడ్‌, బాలీవుడ్‌ నుండి దీని రీమేక్‌ కోసం పోటీ పడుతున్నాయని వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ కోసం ఒక బాలీవుడ్‌ స్టార్‌ లైన్‌లో ఉండగా.. తాజాగా ఒక కోలీవుడ్‌ హీరో కూడా  ఈ చిత్రం కోసం పోటీ పడుతున్నారని తెలిసింది. 

షడ్రుచులు, అరిషడ్వర్గాలు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వినోద్‌ వర్మ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. మనుషుల్లో ఉండే లోతైన కోరికలను తీర్చే  పాత్రలో వినోద్‌ వర్మ కనిపించనున్నాడు. ఇక కోరికలు తీర్చుకోవాలనుకు వారు వచ్చి అతనికి చెప్పుకుంటారు. అదే అదనుగా చూసి వినోద్‌ వర్మ నేరాలకు పాల్పడతాడు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులొస్తాయి. ఎలా మలుపు తిరిగాయి అనేది కథ. అలా కోరిక తీరడం కోసం తన వద్దకు వచ్చే పాత్రలో అనసూయ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రం విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు.  

Anasuya.jpg

ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ కోసం కోలీవుడ్‌ నుండి శివకార్తికేయన్‌, బాలీవుడ్‌ నుండి అభిషేక్‌ బచ్చన్‌ పోటీకి దిగారని తెలుస్తోంది. శివకార్తికేయన్‌.. తాజాగా తన మూవీ ‘అయలాన్‌’ ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ  సమయంలో దర్శకుడు జయశంకర్‌ను కలిశాడు. అప్పుడే ‘అరి’ గురించి తెలుసుకున్నాడు. శివకార్తికేయన్‌కు ‘అరి’ బాగా నచ్చడంతో రీమేక్‌ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఇక బాలీవుడ్‌ స్టార్‌ అభిషేక్‌ బచ్చన్  కూడా ‘అరి’ రీమేక్‌ రైట్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో వినోద్‌ వర్మ, అనసూయతోపాటు సాయికుమార్‌, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురభి, కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్వీ సినిమాస్‌ పతాకంపై శ్రీనివాస్‌ రామిరెడ్డి శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. 


Updated Date - Feb 08 , 2024 | 04:00 PM