మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amitabh Bachchan: ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతినిస్తుంది!

ABN, Publish Date - Mar 14 , 2024 | 06:32 PM

ప్రభాస్‌ (Prabhas) ప్రధాన పాత్రలో నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’(kalki 2898 AD) ఇందులో బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ గురించి అమితాబ్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.


ప్రభాస్‌ (Prabhas) ప్రధాన పాత్రలో నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’(kalki 2898 AD) ఇందులో బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ గురించి అమితాబ్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. అలాగే విడుదల తేదీని కూడా చెప్పడంతో దీనిపై వస్తోన్న రూమర్స్‌కు చెక్‌ పడింది  ‘‘కల్కి’ షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్లీ ఆలస్యమైంది. ఈ చిత్రీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా చెప్పిన సమాచారం ప్రకారమే మే 9న విడుదల కానుంది. ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతి ఇవ్వడానికి ఎంతోమంది కష్టపడి పని చేస్తున్నారు’ అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా విడుదల విషయంలో మరోసారి క్లారిటీ వచ్చింది.



'కల్కి’లో ప్రభాస్‌ భైరవగా కనిపించనున్నారు. ఇటీవల ఆ లుక్‌ను విడుదల చేశారు. దీపికా పదుకొణె కథానాయిక. పలు చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్రతారలు ఈ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ కీలక  పాత్రలు పోషిస్తున్నారు. ‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తు తో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నించాం. ఆ ప్రపంచాలు కూడా భారతీయతను ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచాం’’ అని ఇటీవల దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ కార్యక్రమంలో చెప్పారు.

Updated Date - Mar 14 , 2024 | 06:32 PM