ANR Awards: ఏయన్నార్‌ అవార్డు.. అమితాబ్‌, చిరు ట్వీట్స్‌ వైరల్‌

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:35 AM

‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డు’ వేడుక సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! నాలుగేళ్ల విరామం తర్వాత ఈ అవార్డు వేడుకను నిర్వహించారు అక్కినేని ఫ్యామిలీ. ఈ ఏడాది మెగాస్టార్‌ చిరంజీవికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానం చేశారు

ANR Awards: ఏయన్నార్‌ అవార్డు.. అమితాబ్‌, చిరు ట్వీట్స్‌ వైరల్‌

‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డు’ (ANR National Award) వేడుక సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో (Annapurna Studios) వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! నాలుగేళ్ల విరామం తర్వాత ఈ అవార్డు వేడుకను నిర్వహించారు అక్కినేని ఫ్యామిలీ. ఈ ఏడాది మెగాస్టార్‌ చిరంజీవికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) చేతుల మీదుగా చిరంజీవి (Chiranjeevi) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.  తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అమితాబ్‌ అన్నారు. ఈ వేడుకలో చిరంజీవి, నాగార్జునలతో దిగిన ఫొటోను  షేర్‌ చేసి ఇలా రాసుకొచ్చారు. ‘ఏఎన్నార్‌ శతజయంతి సందర్భంగా వారి కుటుంబంలోని, పరిశ్రమలోని వ్యక్తిగా ఆయనకు నివాళులర్పించాను. ఇది భావోద్వేగాలతో నిండిన సాయంత్రం. ఇంత గొప్ప వేడుకలో నన్ను భాగం చేసినందుకు నాగార్జునకు ధన్యవాదాలు. అలాగే చిరంజీవికి నా చేతులమీదుగా ఈ అవార్డు ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని అమితాబ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. (ANR centenary year)



 
అవార్డు అందుకున్న చిరంజీవి కూడా ఈ వేడుక గురించి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా వారి పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డు’ అందుకోవడం సంతోషంగా ఉంది. నా గురువు అమితాబ్‌ చేతులమీదుగా అందుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. అక్కినేని కుటుంబంలోని ప్రతిఒక్కరికీ, అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సభ్యులకు, నా మిత్రుడు, సోదరుడు సుబ్బరామిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు. నా సినీ ప్రయాణంలో భాగమైన, నా ప్రతి మైలురాయికి సహకరించిన ప్రతిఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటాను’’ అని రాసుకొచ్చారు. అవార్డు వేడుకకు సంబంధించిన ఫొటోలు, చిరంజీవి అమితాబ్‌ పాదాలకు నమస్కారం పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Oct 29 , 2024 | 11:44 AM