Amitabh Bachchan: దర్శకుడి ఆలోచనకు ప్రతిరూపం

ABN , Publish Date - May 24 , 2024 | 08:36 PM

ప్రభాస్‌ (Prabhas) - నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కలయికలో వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 ad) . గత రెండు రోజులుగా ఎక్కడ విన్నా ఈ సినిమాలోని బుజ్జి గురించే టాక్‌ నడుస్తోంది.

Amitabh Bachchan: దర్శకుడి ఆలోచనకు ప్రతిరూపం

ప్రభాస్‌ (Prabhas) - నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కలయికలో వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 ad) . గత రెండు రోజులుగా ఎక్కడ విన్నా ఈ సినిమాలోని బుజ్జి గురించే టాక్‌ నడుస్తోంది. ఈ చిత్రంలో కీలకమైన ‘బుజ్జి’ అనే వాహనాన్ని అబిమానులకు పరిచయం చేసింది చిత్ర బృందం. ఇప్పుడు అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అశ్వత్థామ పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ‘ఇలాంటి ప్రాజెక్ట్‌ తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరు. రోజులు గడిచేకొద్దీ షూటింగ్‌ చేస్తున్న సమయంలో కొన్ని సన్నివేశాలు దీని విజయం గురించి సంకేతాలిస్తాయి. డైరెక్టర్‌ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారు. ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎన్ని ఏళ్లు అయినా ఆగవు. ఇప్పుడు నేను మెచ్చుకున్నట్లే ఎంతోమంది దీన్ని ప్రశంసిస్తారు. ఇందులోని బుజ్జి మరో అద్భుతం. దర్శకుడి ఆలోచనలకు అది ప్రతిరూపం’’ అని అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే దుల్కర్‌ సల్మాన్‌, పశుపతి, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

Updated Date - May 24 , 2024 | 08:36 PM