Allu Arjun: షారుఖ్‌కి 'నో' చెప్పిన బన్నీ.. ఎందుకో తెలుసా

ABN, Publish Date - Dec 02 , 2024 | 07:55 PM

అల్లు అర్జున్ తన కెరీర్‌లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాడు. అవి ఏంటి? ఎందుకంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టెక్నీకల్‌గా ఫస్ట్ పాన్ ఇండియన్ హీరో అనుకోవచ్చు. ఏ స్టార్ హీరో అయినా పాన్ ఇండియా సినిమాలతో ఇతర భాష ప్రేక్షకులకి దగ్గరయ్యారు. కానీ.. దశాబ్దం క్రితమే స్ట్రెయిట్ తెలుగు సినిమాలతోనే కేరళ, తమిళనాడు, హిందీ బెల్ట్ ప్రేక్షకులకి చేరువయ్యాడు బన్నీ. ఇంతటి క్రేజ్ ఉన్న ఆయనతో పని చేయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు అనుకుంటారు. అయితే వివిధ కారణాలతో కొన్ని క్రేజి ప్రాజెక్ట్స్ బన్నీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే బాలీవుడ్ 'బాద్ షా' షారుఖ్ ఖాన్‌కి కూడా నో చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటంటే..


అర్జున్ రెడ్డి

ఈ సినిమా కోసం మొదట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బన్నీని సంప్రదించిన విషయం తెలిసిందే. కానీ.. ఆ ప్రాజెక్స్ట్ చివరకి విజయ్ దేవరకొండకి దక్కింది.

భద్ర

బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శీను సెన్సేషనల్ హిట్ 'భద్ర' సినిమా కోసం మొదట బన్నీని సంప్రదించారట. కొన్ని అనివార్య కారణాల వల్ల బన్నీ ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. దీంతో ఆ ప్రాజెక్ట్ రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా మారింది.

బజరంగీ భాయీజాన్

ఈ సినిమా కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ మొదట బన్నీని అనుకున్నారట. కానీ ఆ ప్రాజెక్ట్ సల్మాన్ కెరీర్‌లోనే మరుపురాని చిత్రంగా మారింది.

లైగర్

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 'లైగర్' సినిమా అల్లు అర్జున్ చేయాల్సి ఉండదని సమాచారం. కానీ.. అది విజయ్ దేవరకొండ వద్దకి చేరింది. ఎంత పెద్ద డిజాస్టర్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

100% లవ్

తన బెస్ట్ ఫ్రెండ్ సుకుమార్‌కి కూడా బన్నీ నో చెప్పేశాడు. దీంతో ఆయన 100% లవ్ కి నాగ చైతన్యని సెలెక్ట్ చేసుకున్నారు.

జవాన్

షారుఖ్, అట్లీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జవాన్'. ఈ మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్‌లో నటించాల్సి ఉంది. కానీ.. షెడ్యూల్ కుదరక బన్నీ నో చెప్పేశారట. ఇక అట్లీతో బన్నీ ఓ సినిమా చేయనున్నట్లు టాక్

Updated Date - Dec 02 , 2024 | 07:55 PM