Allu Arjun: ఆ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది హీరో!

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:18 AM

'పుష్ప-2’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ఐకాన స్టార్‌ అల్లు అర్జున్‌ కుటుంబంతో కలిసి దుబాయ్‌లో అడుగుపెట్టారు. అయితే షూటింగ్‌ కోసం కాదు. దుబాయ్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

Allu Arjun: ఆ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది హీరో!

'పుష్ప-2’ (Pushpa-2) షూటింగ్‌తో బిజీగా ఉన్న ఐకాన స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu arjun) కుటుంబంతో కలిసి దుబాయ్‌లో అడుగుపెట్టారు. అయితే షూటింగ్‌ కోసం కాదు. దుబాయ్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ (madame tussauds )మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ (Wax statue) కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.


Allu-arjun2.jpg
ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మార్చి 28వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీని కోసం అల్లు అర్జున్‌ కుటుంబంతో  దుబాయ్‌ చేరుకున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో  ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే! కానీ ఇవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. అల్లు అర్జున్‌ విగ్రహం మాత్రం దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్ల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం. దీంతో దక్షిణాది తొలి హీరోగా బన్నీ రికార్డ్‌ సెట్‌ చేశారు. అంతే కాకుండా దుబాయ్‌ గోల్డెన్‌ వీసా అందుకున్న తొలి తెలుగుస్టార్‌ కూడా ఆయనే కావడం విశేషం.

సింగపూర్‌, లండన్‌, దుబాయ్‌.. ఇలా పలు చోట్ల  ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్‌ మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌  విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్‌ చేరనున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 11:14 AM