Pushpa2 The Rule: హెడ్‌ఫోన్స్ సిద్ధ‌మా.. త‌గ్గేదేలే! ‘పుష్ప2’ అప్డేట్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:30 AM

‘హెడ్‌ఫోన్స్‌ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ టీజర్‌కు సెన్సేషనల్‌ బీజీఎం రాబోతోంది’ అంటూ పుష్ఫ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

Pushpa2 The Rule: హెడ్‌ఫోన్స్ సిద్ధ‌మా.. త‌గ్గేదేలే! ‘పుష్ప2’ అప్డేట్‌
pushpa 2

‘హెడ్‌ఫోన్స్‌ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ (Pushpa2 The Rule) టీజర్‌కు సెన్సేషనల్‌ బీజీఎం రాబోతోంది’ అంటూ పుష్ఫ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ఫ ది రూల్‌. ఆగ‌స్టు 15 న థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ సినిమా నుంచి గ‌తంలో ఓ టీజ‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జ‌న్మ‌దినంను పుర‌స్క‌రించుకుని మ‌రో టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈనేప‌థ్యంలో చాలామంది అభిమానులు ఇప్పుడు ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

dsp.jpeg

ఈ క్ర‌మంలోనే ‘హెడ్‌ఫోన్స్‌ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ (Pushpa2 The Rule) టీజర్‌కు సెన్సేషనల్‌ బీజీఎం రాబోతోంది’ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. సోమ‌వారం ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌నున్న పుష్ప 2 ది రూల్ టీజ‌ర్ (Pushpa2 The Rule Teaser.) బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రెడీ చేసేందుకు అల్లు అర్జున్‌, సుకుమార్ ఇద్ద‌రు క‌లిసి ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD)తో క‌లిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో వారు క‌లిసి దిగిన ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేయ‌గా బాగా వైర‌ల్ అవుతోంది.


ఇదిలాఉండ‌గా పుష్ప పార్ట్‌1 దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో పాటు అందులోని పాట‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన‌లేని గుర్తింపు వ‌చ్చింది. దీంతో ఇప్పుడు పుష్ఫ‌2 ది రూల్ (Pushpa2 The Rule) మ్యూజిక్‌పై అంత‌కుమించి అనేలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెర‌గ‌డంతో ఆ స్థాయిలోనే సంగీతం అందించేందుకు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD) క‌ష్ట ప‌డుతున్నాడు. ఈక్ర‌మంలోనే కొన్ని ట్యూన్స్ రెడీ చేసిన‌ట్లు స‌మాచారం.

Updated Date - Apr 05 , 2024 | 10:30 AM