Pushpa 2 The Rule: పుష్పరాజ్ గడ్డం అట్టా సవరిస్తుంటే బాక్సాఫీస్ దద్దరిల్లే.. అదిరిపోయిన ‘పుష్ప పుష్ప’ సింగిల్‌

ABN , Publish Date - May 01 , 2024 | 05:08 PM

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ అంటూ.. ‘పుష్ప‌-2 ది రూల్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడులైంది. మేక‌ర్స్ చెప్పిన విధంగానే బుధ‌వారం సాయంత్రం 5.గంట‌ల 4 నిమిషాల‌కు పాట‌ను విడుద‌ల చేశారు.

 Pushpa 2 The Rule: పుష్పరాజ్ గడ్డం అట్టా సవరిస్తుంటే బాక్సాఫీస్ దద్దరిల్లే.. అదిరిపోయిన ‘పుష్ప పుష్ప’ సింగిల్‌
pushpa

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ అంటూ.. ‘పుష్ప‌-2 ది రూల్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడులైంది. ప్ర‌పంచవ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌-2 ది రూల్’ (Pushpa2 The Rule). ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా.. నేషనల్ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకుని టాలీవుడ్ సత్తా ఏంటో చూపించారు. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Director Sukumar) ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. ఇప్పుడందరి చూపు ‘పుష్ప’ (Pushpa)కు సీక్వెల్‌గా రాబోతోన్న ‘పుష్ప 2 ది రూల్’ పైనే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ సినిమా నుంచి వస్తోన్న ఒక్కో అప్‌డేట్ అలా వైరల్ అవుతోంది మరి.

మేక‌ర్స్ చెప్పిన విధంగానే బుధ‌వారం సాయంత్రం 5.గంట‌ల 4 నిమిషాల‌కు ‘పుష్ప 2: ది రూల్‌’ చిత్రం నుంచి సౌత్ ఇండియా సెన్షేష‌న్‌ దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad) సంగీత సారథ్యంలో ఈ చిత్రంలోని మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను ఆరు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ) విడుదల చేసి కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టారు. ఈ వీడియోలో పుష్పరాజ్ తన యాటిట్యూడ్‌ను కంటిన్యూ చేస్తూ.. ప్రేక్ష‌కుల్లో గూస్‌బంప్స్ తీసుకు వ‌చ్చేలా ఉంది. అదేవిధంగా గ్యాన్స్ స్టెప్స్ కూడా అదిరిపేయేలా ఉన్నాయి.


ఈ పాట‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో అజీజ్ నకాష్ (Nakash Aziz), దీపక్ మ్యూజిబ్లూ (Deepak muziblue) ఆల‌పించ‌గా క‌న్న‌డ‌లో విజ‌య్ ప్ర‌కాశ్ (vijay prakash), మ‌ళ‌యాలంలో రంజిత్ గోవింద్ (Ranjith Govind), హిందీలో అజీజ్ నకాష్ (Nakash Aziz), మికా సింగ్ (Mika Singh), బెంగాలీలో తిమిర్ బిశ్వాస్ (Timir Biswas) పాడారు. ఈ పాట‌కు తెలుగులో అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (chandrabose) సాహిత్యం అందించ‌గా త‌మిళంలో వివేకా (Viveka) మ‌ళ‌యాలంలో సిజు తురవూరు (Siju Thuravoor), కన్న‌డ‌లో వ‌ర‌ద‌రాజ్ (Varadaraj), బెంగాలీలో శ్రీజ‌తో బంధోఫాధ్యాయ్ (Srijato), హిందీలో ర‌కీబ్ ఆలం (Raqueeb Alam) లిరిక్స్ అందించారు.

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్ (PushpaPushpa).. నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంది.. ఈ పాటతోనే పుష్పగాడి రూల్ ఎలా ఉండబోతుందో తెలియజేసేలా యూనిట్ ప్లాన్ చేసిందనేలా టాక్ మొదలైంది. ‘పుష్ప’ విజయానికి దేవిశ్రీ సంగీతం, ఆయన స్వరపరిచిన పాటలు ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌లో కూడా మరోసారి దేవి మ్యాజిక్ చేయబోతున్నాడనేలా అప్పుడే యూనిట్‌లో టాక్ నడుస్తుండటం విశేషం. కాగా.. 2024 ఆగస్టు 15న స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల (Pushpa 2 The Rule Release Date) చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Updated Date - May 01 , 2024 | 05:13 PM