Kalki 2898 AD: క‌ల్కి సినిమాపై.. అల్లు అర్జున్‌, మోహ‌న్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ ఏమ‌న్నారంటే?

ABN , Publish Date - Jun 30 , 2024 | 10:26 AM

‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై ప్రేక్ష‌కుల నుంచే కాకుండా సినిమా స్టార్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్టులో అల్లు అర్జున్‌, మోహ‌న్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక‌ చేరారు.

Kalki 2898 AD: క‌ల్కి సినిమాపై.. అల్లు అర్జున్‌, మోహ‌న్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ ఏమ‌న్నారంటే?
kalki

అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప్రభాస్‌ (Prabhas) వంటి బిగ్ స్టార్స్ న‌టించ‌గా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై క‌లెక్ష‌న్ల ప్ర‌భంజనం సృష్టిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD). నాలుగు రోజుల క్రితం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమాకు అద్భుత స్పంద‌న ల‌బిస్తోంది. ప్రేక్ష‌కులు స‌రికొత్త అనుభూతిని ఫీల‌వుతూ ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌(Nag Ashwin)తో పాటు టీం అంద‌రిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Kalki-Prabhas.jpg

ఇప్ప‌టికే అరుదుగా స్పందించే ర‌జ‌నీకాంత్ (Rajinikanth) , నాగార్జున (Nagarjuna) వంటి స్టార్స్‌ కూడా సినిమాను మెచ్చుకుంటూ పోస్టులు పెట్ట‌డం బాగా వైర‌ల్ ఆవుతోంది. ఈ క్ర‌మంలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్‌ (Allu Arjun), మోహ‌న్ బాబు (Mohan Babu M) వంటి స్టార్స్ కూడా మూవీపై త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. దీంతో స్టార్స్ అంతా సినిమాను ఇంత‌లా మెచ్చ‌కుంటుండ‌డంతో ప్రభాస్‌ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సినిమా వ‌సూళ్లు కూడా అంత‌కంత‌కు పెరుగుతూ ఉన్నాయి.


తాజాగా మోహ‌న్‌బాబు (Mohan Babu M) స్పందిస్తూ.. ఈ రోజే ‘కల్కి’ (Kalki 2898 AD) సినిమా చూశాను. మహాద్భుతంగా ఉంది.. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌, నిర్మాత, దర్శకుడు మొత్తం యూనిట్‌కు నా అభినందనలు తెలియ‌జేస్తున్నా అని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాను అందించార‌ని అన్నారు.

అల్లు అర్జున్ (Allu Arjun), విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna)లు త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఎక్స్‌ల‌లో క‌ల్కి (Kalki 2898 AD) సినిమాను ప్ర‌శంసిస్తూ ప్ర‌తి ఒక్క‌రిని పోగుడుతూ పోస్టు పెట్టారు. సినిమా విజువ‌ల్ వండ‌ర్‌గా ఉంద‌ని, నాగ్ ఆశ్విన్ (Nag Ashwin) ఓ అద్బ‌తమే చేశాడంటూ అభినందిచారు. ఇప్పుడు వీరంద‌రి పోస్టులు బాగా వైర‌ల్ అవుతున్నాయి.Updated Date - Jun 30 , 2024 | 10:28 AM