Samantha: స్టూడెంట్స్‌ ప్రశ్నకు అదిరిపోయే జవాబు!

ABN , Publish Date - Mar 05 , 2024 | 11:39 AM

టాలీవుడ్‌ ఐకాన్  స్టార్‌ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించింది అగ్ర కథానాయిక సమంత. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ వీడియోలు వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ కాలేజీ ఫెస్ట్‌లో పాల్గొన్న సమంతను కొందరు స్టూడెంట్స్‌ ‘నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?’ అని అడిగా

Samantha: స్టూడెంట్స్‌ ప్రశ్నకు అదిరిపోయే జవాబు!



టాలీవుడ్‌ ఐకాన్  స్టార్‌ అల్లు అర్జున్ (Allu arjun)పై ప్రశంసల వర్షం కురిపించింది అగ్ర కథానాయిక సమంత (Samantha). దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ వీడియోలు వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ కాలేజీ ఫెస్ట్‌లో పాల్గొన్న సమంతను కొందరు స్టూడెంట్స్‌ ‘నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?’ అని అడిగారు. ‘యాక్టింగ్‌లో నాకు అల్లు అర్జున్  స్ఫూర్తి అని సమాధానమిచ్చింది. తనతో కలిసి మరోసారి సినిమా చేయాలనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్‌ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు బన్నీ’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలను బన్నీ ఫాన్స్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. గతంలోనూ ఓ సందర్భంలో సమంత ఇదే విషయాన్ని చెప్పింది.

Untitled-3.jpg

అల్లు అర్జున్  తన సూపర్‌ హీరో అని చెప్పింది. వీళ్లిద్దరూ కలిసి ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’లో నటించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా చక్కని విజయాన్ని అందుకొంది. అలాగే సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’లో అల్లు అర్జున్‌, సమంత ‘ఊ అంటావా..’ పాటకు స్టెప్పులేశారు. ఈ పాట పాన్  ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులోనూ ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉందని టాక్‌. అయితే ఇందులో ఆ పాటలో సమంత కనిపిస్తారా లేక వేరే హీరోయిన్ ఎవరైన కనిపిస్తార అన్నది తెలియాల్సి ఉంది. 

Updated Date - Mar 05 , 2024 | 11:44 AM