Akshay kumar -Kannappa: తొలి తెలుగు సినిమాకు సిద్ధమేనా?

ABN , Publish Date - Apr 08 , 2024 | 02:50 PM

మంచు విష్ణు (Manchu vishnu) టైటిల్‌ పాత్ర పోషిస్తున్నా చిత్రం ‘కన్నప్ప’(Kannapa). ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇంటర్‌నెట్‌లో షేర్‌ అవుతోంది.

Akshay kumar -Kannappa: తొలి తెలుగు సినిమాకు సిద్ధమేనా?
AKshay kumar, Manchu Vishnu

మంచు విష్ణు (Manchu vishnu) టైటిల్‌ పాత్ర పోషిస్తున్నా చిత్రం ‘కన్నప్ప’(Kannapa). ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇంటర్‌నెట్‌లో షేర్‌ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన స్టార్స్‌ ఈ చిత్రంలో భాగమైన సంగతి తెలిసిందే! ఇప్పుడు బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ (Akshay kumar)కూడా ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ విషయాన్ని ట్విట్టర్  వేదికగా పంచుకున్నారు. త్వరలోనే అక్షయ్‌ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారట. ఇదంతా నిజమే అయితే  ఆయనకు ‘కన్నప్ప’ తొలి తెలుగు సినిమా అవుతుంది. 1993లో ఓ కన్నడ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ కనిపించారు. ఆ తర్వాత 2018లో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో2.0లో తమిళ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఇప్పుడు ఈ మూవీతో తెలుగు  పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. అక్షయ్‌ ఏ పాత్రలో కనిపించనున్నారో తెలియాల్సి ఉంది. నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వస్తేగానీ క్లారిటీ రాదు.

Theater And OTT: ఈ వారం థియేటర్‌-ఓటీటీలో సందడి చిన్న చిత్రాలదే!



మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌ భాగమయ్యారు. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. శివ పార్వతులుగా ప్రభాస్‌, నయనతార నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 02:53 PM