నాగార్జున - అక్షయ్‌కుమార్‌ ఓ మల్టీస్టారర్‌! 

ABN , Publish Date - Feb 02 , 2024 | 05:25 PM

‘నా సామిరంగ’ చిత్రంతో సంక్రాంతి బరిలో హిట్‌ కొట్టారు కింగ్‌ నాగార్జున. ప్రస్తుతం ఇదే జోష్‌తో కొత్త కథలు  వింటున్నారు. 'నా సామిరంగా' కంటే ముందు తమిళ దర్శకుడు చెప్పిన కథకు నాగ్‌ ఓకే చెప్పారు.. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి.

నాగార్జున - అక్షయ్‌కుమార్‌ ఓ మల్టీస్టారర్‌! 

‘నా సామిరంగ’ చిత్రంతో సంక్రాంతి బరిలో హిట్‌ కొట్టారు కింగ్‌ నాగార్జున. ప్రస్తుతం ఇదే జోష్‌తో కొత్త కథలు  వింటున్నారు. 'నా సామిరంగా' కంటే ముందు తమిళ దర్శకుడు చెప్పిన కథకు నాగ్‌ ఓకే చెప్పారు.. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కథ ఓ మల్టీస్టారర్‌గా రూపొందనుందని టాక్‌ నడుస్తోంది. ఈ చిత్రంలో నాగ్‌తో పాటు మరో పాత్ర కోసం అక్షయ్‌కుమార్‌ పేరు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్షయ్‌ అంగీకరిస్తే నాగ్‌ ఖాతాలో ఓ పాన్‌ ఇండియా సినిమా పడినట్టే. నాగార్జునకి బాలీవుడ్‌లో గుర్తింపు బాగానే ఉంది. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’లో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. అక్షయ్‌ సినిమాలకు సౌత్‌ లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. సో.. ఇద్దరూ కలిస్తే పాన్‌ ఇండియా పరంగా ఈ సినిమాకి ఓ క్రేజ్‌ వస్తుంది. ఇదో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. బహుశా అక్షయ్‌ నెగిటివ్‌ లక్షణాలున్న పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్షయ్‌ అంగీకరిస్తారా లేదా అన్నది చూడాలి. 1998 అక్షయ్‌కుమార్‌ - నాగార్జున కలయికలో మహేష్‌ భట్‌ దర్శకత్వంలో 'అంగారే’ చిత్రంలో నటించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వీరిద్దరి కాంబోలో మరో చిత్రం వచ్చే అవకాశం ఉంది.  నాగార్జున వందో చిత్రంగాసినిమాను ప్రకటించే అవకాశాలున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ రానుంది. 

Nagarjuna-2.jpg

Updated Date - Feb 02 , 2024 | 05:25 PM